ఐశ్వర్య రాయ్‌ - అభిషేక్ బచ్చన్ విడాకులు..? వైరల్ అవుతున్న న్యూస్..

Published : Apr 08, 2023, 03:26 PM IST
ఐశ్వర్య రాయ్‌ - అభిషేక్ బచ్చన్ విడాకులు..? వైరల్ అవుతున్న న్యూస్..

సారాంశం

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అభిషేక్ బచ్చన్... ఐశ్వర్య రాయ్‌ విడాకులు తీసుకోబోతున్నార. బీటౌన్ లో వైరల్ అవుతున్న న్యూస్ లో నిజమెంత. అసలు ఈ వార్తలు ఎందుకు బయటకు వస్తున్నాయి...?  


బాలీవుడ్ లో  స్టార్ కపుల్.. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు.  ఐశ్వర్య రాయ్‌, అభిషేక్ బచ్చన్. వీరిద్దరు దాదాపు గా 20 ఏళ్లనుంచి  ఎటువంటి గొడవలు లేకుండా ఆయిగా కాపురం చేసుకుంటున్నారు. వీరికి  ఓ పాప ఆరాధ్య కూడా ఉంది. ఇక వీరి గురించి సోషల్ మీడియాలో .. ముఖ్యంగా బీ టౌన్ లో కోన్ని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు స్టార్లు త్వరలో  విడాకులు తీసుకోబోతున్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ వార్తలు బాలీవుడ్ లో వైరల్ గా మారిపోయాయి.  దానికి కారణం కూడా లేకపోలేదు. 

ఎప్పుడు కలిసే ఉంటారు ఈ ఇద్దరు కపుల్స్..  ఏ పార్టీకి వెళ్ళినా.. సినిమా పంక్షన్లు జరిగినా.. ఏదైనా సరే ఇద్దరు తప్పకుండా రావాల్సిందే. అంతే కాదు ఒక్కరు మాత్రం కనిపించరు ఎప్పుడూ.. కాని ఈ మధ్య కాలంలో ఐశ్వర్య అండ్ అభిషేక్ బయట ఏ ఫంక్షన్ లో కలిసి కనిపించడం లేదు. అయితే అభిషేక్ కాని.. లేకుంటే ఐశ్వర్యరాయ్ కాని కనిపిస్తుంది తప్పించి ఇద్దరు కలిసి ఏ పార్టీలకు రావగంలేదు. ఐష్ మాత్రం తన కూతురు ఆరాధ్యను వెంట పెట్టుకుని అన్నటింటికి వెళ్తుంది. 

అంతే కాదు రీసెంట్ గా ముంబయ్ లో గ్రాండ్ గా జరిగిన  నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్‌కు కూడా ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో మాత్రమే కలిసి వచ్చింది. ఇంత పెద్ద ఫంక్షన్ కు అభిషేక్ రాకుండా.. ఐష్ మాత్రమే రావడంతో.. మరోసారి వీరి వీడాకుల వార్తలు గుప్పుమన్నాయి. బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న రూమర్స్ కు  ఈ సీన్ తో  మరింత బలం చేకూరింది. దాంతో సోషల్ మీడియాలో వరుసగా స్పందించడం మొదలు పెట్టారు. 

బాలీవుడ్ తో పాటు.. పాన్ ఇండియాను ఒక ఊపు ఊపేసింది మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్యారాయ్. బాలీవుడ్ తో పాటు తమిళ సినిమాల్లో మెరిసే ఈ బ్యూటీ.. 2007 లో కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే.. అమితాబచ్చన్ తనయుడు.. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ను పెళ్ళాడింది. వీరికి 2012 కూతురు పుట్టగా.. ఆరాధ్య అనిపేరు పెట్టి ప్రేమగా చూసుకుంటున్నారు. ఇక ఇదంతా బాగానే ఉంది కాని.. వీరి పెళ్ళి జరిగిన ఇన్నాళ్లకు ఇద్దరు స్టార్లు విడాకులు తీసుకోబోతున్నారంటూ..రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?