తండ్రి కాబోతున్న ముక్కు అవినాష్‌.. ఆ ప్రశ్నలకు సమాధానం ఇదే అంటూ ఎమోషనల్‌ పోస్ట్..

Published : Jul 09, 2023, 08:26 AM IST
తండ్రి కాబోతున్న ముక్కు అవినాష్‌.. ఆ ప్రశ్నలకు సమాధానం ఇదే అంటూ ఎమోషనల్‌ పోస్ట్..

సారాంశం

జబర్దస్త్ కమెడియన్‌ ముక్కు అవినాష్‌.. తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. తాము ఇద్దరం త్వరలో ముగ్గురం కాబోతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది.

జబర్దస్త్ కమెడియన్‌గా పాపులర్‌ అయ్యాడు ముక్కు అవినాష్‌. ఈ షోలో తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు. తాను ఎక్కడ ఉన్నా నవ్వులే నవ్వులు అనేంతగా పేరుతెచ్చుకున్నారు. బిగ్‌ బాస్‌ షోలోనూ పాల్గొని అలరించాడు. ప్రస్తుతం స్టార్‌ మాలో షోస్‌ చేస్తూ, ఆహాలో షోస్‌ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పాడు అవినాష్‌. తాను తండ్రి కాబోతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం తన భార్య ప్రెగ్నెంట్‌తో ఉందని వెల్లడించారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం తన భార్య అనుజ నాలుగో నెల అని త్వరలోనే తాము పేరెంట్స్ హోదాని పొందబోతున్నట్టు, ఇద్దరం కాస్త ముగ్గురం కాబోతున్నట్టు తెలిపారు ముక్కు అవినాష్‌. 

ఇక ఈ వీడియోలో అవినాష్‌ మాట్లాడుతూ, తన యూట్యూబ్‌ ఛానెల్లో పెట్టే వీడియోలను చూసి తన భార్య ప్రెగ్నెంటా?  అంటూ ప్రశ్నించారు. రూమర్స్ క్రియేట్‌ చేశారు. దానిపై మేంస్పందించాం, అలాంటిది ఏదైనా ఉంటే కచ్చితంగా మేమే స్వయంగా వెళ్లడిస్తామని తెలిపారు. పైగా చాలా మంది అడుగుతున్నారు పిల్లలెప్పుడు అని, దానికి సమాధానం చెప్పే టైమ్‌ వచ్చింది. అవును.. త్వరలో మేం ఇద్దరం కాస్త ముగ్గురం కాబోతున్నాం. అనుజ ఇప్పుడు ప్రెగ్నెంట్. ప్రస్తుతం నాలుగో నెల. మరో ఐదు నెలల్లో మా జీవితంలోకి మరో చిన్నారి రాబోతున్నారు. అందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. 

ఈ వార్త తెలిసి మా పేరెంట్స్, అనుజ పేరెంట్స్ సైతం సంతోషంగా ఉన్నారు` అని వెల్లడించారు అవినాష్‌. తమ పెళ్లి అయిన ఏడాది కావొస్తుందని, అక్టోబర్‌లో తమ పెళ్లి రోజు అని, ఇంతలోనే గుడ్‌ న్యూస్‌ రావడం చెప్పలేని ఆనందాన్నిస్తుందన్నారు అవినాష్‌. ఈ సందర్బంగా తన భార్య అనుజ కూడా తన సంతోషాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. అభిమానులను ఆకట్టుకుంటుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది