`ఖుషి` నుంచి మరో రొమాంటిక్‌ సాంగ్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Published : Jul 08, 2023, 11:12 PM IST
`ఖుషి` నుంచి మరో రొమాంటిక్‌ సాంగ్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే?

సారాంశం

ఇప్పటికే `నా రోజు నువ్వే` అంటూ సాగే పాటని విడుదల చేశారు. అది యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.   `ఖుషి` సినిమా నుంచి రెండో సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు.  

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన `ఖుషి` సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా టోటల్‌ షూటింగ్‌ పూర్తి కాబోతుందని, ఇటీవల టీమ్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. విజయ్‌ దేవరకొండ కూడా ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో చిత్ర షూటింగ్‌ పూర్తి కావచ్చింది. మరోవైపు ప్రమోషన్స్ పరంగానూ స్పీడ్‌ పెంచుతుంది యూనిట్‌. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే `నా రోజు నువ్వే` అంటూ సాగే పాటని విడుదల చేశారు. అది యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. సమంతని ఉద్దేశించిన విజయ్‌ దేవరకొండ పాడుకునే పాట అది. 

ఇప్పుడు మరో సాంగ్ రాబోతుంది. `ఖుషి` సినిమా నుంచి రెండో సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు. `ఆరాధ్య` అంటూ సాగే ఈ పాటకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ నెల 12(బుధవారం) ఈ పాటని విడుల చేయబోతున్నట్టు తాజాగా విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో విజయ్‌, సమంత ఎంతో క్యూట్‌గా ఉన్నారు. ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. వీరిద్దరులో ఘాటు ప్రేమలో ఉన్నారు. త్వరలో రిలీజ్‌ కాబోతున్న `ఆరాధ్య` పాట రొమాంటిక్‌ సాంగ్‌ అని తెలుస్తుంది. 

సోమవారం సాంగ్‌ ప్రోమోని, బుధవారం పాటని విడుదల చేస్తామని తెలిపింది యూనిట్‌. `ఇప్పటికే 'నా రోజా నువ్వే' అనే పాటు యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. వంద మిలియన్లకు చేరువలో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్‌ 'ఆరాధ్య'తో మరో సారి 'ఖుషి' సినిమా ట్రెండ్ అవ్వడం ఖాయం. చార్ట్ బస్టర్ లిస్ట్‌లో ఆరాధ్య పాట కూడా చేరనుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్  మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్. తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాం.

డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో `ఖుషి`పై ఇప్పటికే  భారీ అంచనాలు నెలకొన్నాయి. లవ్ స్టోరీ, ఎమోషనల్ స్టోరీని తీయడంలో శివ నిర్వాణ మార్క్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరోసారి శివ నిర్వాణ తన మ్యాజిక్ చూపించేందుకు రెడీగా ఉన్నాడు` అని యూనిట్ తెలిపింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. నవీన్‌ ఎర్రేని, రవిశంకర్‌ నిర్మాతలు. 

నటీనటులు: 
విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.

టెక్నికల్ టీమ్:

మేకప్        : బాషా
కాస్ట్యూమ్ డిజైనర్స్    : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
ఆర్ట్        : ఉత్తర కుమార్, చంద్రిక
ఫైట్స్        : పీటర్ హెయిన్
రచనా సహకారం        : నరేష్ బాబు.పి
పి.ఆర్.వో        : జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ         : బాబ సాయి
మార్కెటింగ్         : ఫస్ట్ షో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్     : దినేష్ నరసింహన్
ఎడిటర్         : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్     : జయశ్రీ లక్ష్మీనారాయణన్
మ్యూజిక్ డైరెక్టర్         : హిషామ్ అబ్దుల్ వాహబ్
డి.ఐ, సౌండ్ మిక్స్    ః అన్నపూర్ణ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మాట్రిక్స్ 
సి.ఇ.ఓ         : చెర్రీ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ    : జి.మురళి
నిర్మాతలు         : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం     : శివ నిర్వాణ.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?