'జబర్దస్త్' కు కమెడీయన్ కు ఈ తెర వెనక కష్టాలేంటి ?

By Surya PrakashFirst Published Apr 9, 2021, 4:50 PM IST
Highlights

వివాదానికి కారణమైన ఇంటి విషయంలో తనకి న్యాయం జరగలేదని.. బెదిరింపులు ఎక్కువయ్యాయంటూ  న్యాయం చేయాలని కోరుతూ జబర్దస్త్‌ వినోద్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రమేష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఇంతకు ముందోసారి ఇంటి ఓనర్ దాడిలో తీవ్ర గాయాలపాలైన జబర్దస్త్ వినోద్  అలియాస్ వినోదిని మరోసారి పోలీసుల్ని ఆశ్రయించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆ తర్వాత అప్ డేట్స్ ఏమీ రాలదు. దాంతో అందరూ ఆ వివాదం పరిష్కారం అయ్యిపోయి ఉంటుందిలే..చక్కగా జబర్దస్త్ చేసుకుంటన్నాడు అనుకున్నారు. అయితే వివాదానికి కారణమైన ఇంటి విషయంలో తనకి న్యాయం జరగలేదని.. బెదిరింపులు ఎక్కువయ్యాయంటూ  న్యాయం చేయాలని కోరుతూ జబర్దస్త్‌ వినోద్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రమేష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఆ వినతి పత్రంలో .. ‘‘ప్రస్తుతం నివాసం ఉంటున్న అద్దె ఇంటిని అమ్ముతానని ఇంటి ఓనర్ రూ.40లక్షలకు అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఏడాది క్రితం రూ.13.40లక్షలు అడ్వాన్సు కూడా తీసుకున్నారు. ఇప్పుడేమో రూ.40లక్షల కంటే ఎక్కువ ఇస్తేనే ఇల్లు అమ్ముతానని, లేని పక్షంలో అడ్వాన్సుగా ఇచ్చిన రూ.13.40లక్షలు కూడా తిరిగి ఇవ్వమని బెదిరిస్తున్నారు. గతంలో దాడి చేశారు. దాడి ఘటనపై అప్పట్లో కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాకు న్యాయం చేయండి’’ అని డీసీపీకి అందజేసిన వినతిపత్రంలో వినోద్‌ పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని కుత్బిగూడలో అద్దె ఇంటిలో ఉంటున్న వినోద్‌పై 2019 జూలై లో ఇంటి ఓనర్ దాడి చేశారు.  తీవ్రగాయాలతో వినోద్ పోలీసుల్ని ఆశ్రయించారు. తనకి ఇల్లు అమ్ముతానని అడ్వాన్స్ తీసుకోవడమే కాకుండా.. తనపై హత్యాయత్నం చేశారని.. ఇంటి ఓనర్ ప్రమీల, భర్త బాలాజీ, పెద్ద కొడుకు ఉదయ్ సాగర్, చిన్న కొడుకు అభిషేక్, పెద్ద కోడలు సంధ్య తనపై మూకుమ్మడి దాడి చేసి కొట్టారంటూ 2019 జూలై నెలలో పోలీసులకు కంప్లైట్ చేశారు వినోద్. తనపై హత్యయత్నం చేయడంతో పాటు కులం పేరుతో దూషించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు వినోద్.దాంతో నిందితులపై ఐపీసీ 323, 506 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.

click me!