రాజమౌళి అసలు ఊహించలేదట.. మహేష్ మూవీతో ఆ ప్రయత్నం ?

By team teluguFirst Published Sep 16, 2022, 8:01 PM IST
Highlights

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రాంచరణ్, ఎన్టీఆర్ లని జక్కన్న ప్రజెంట్ చేసిన విధానం అదుర్స్. బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జనాలు నీరాజనాలు పట్టారు. 

అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి దక్కుతున్న గుర్తింపు ఊహకు అందని విధంగా ఉంది. బాహుబలి చిత్రానికి కూడా వరల్డ్ వైడ్ గా ఇంత రీచ్ లభించలేదు అనే చెప్పాలి.  హాలీవుడ్ అభిమానులకు, దర్శకులకు, రచయితలకు ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ స్థాయిలో నచ్చడంపై ఒకింత రాజమౌళి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ఫారెన్ లో జరుగుతున్న టోరెంటో ఫిలిం ఫెస్టివెల్ కు రాజమౌళి అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ వేదికపై ఆర్ఆర్ఆర్ గురించి రాజమౌళి మాట్లాడారు. నేను ఎలాంటి సినిమాలు చేసినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ ని దృష్టిలో పెట్టుకునే చేస్తాను. 

సాధారణంగా హాలీవుడ్ అభిమానుల టేస్ట్ వేరు. ఇండియన్ సినిమాలు వాళ్ళకి నచ్చవు అనే అభిప్రాయం ఉంది. నేను కూడా అలాగే భావించే వాడిని. బాహుబలి చిత్రం కొంతవరకు జపాన్ ఆడియన్స్ ని మెప్పించింది. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రానికి హాలీవుడ్ వాళ్ళ నుంచి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని రాజమౌళి అన్నారు. 

ఆర్ఆర్ఆర్ చిత్రం చూశాక మనం కూడా హాలీవుడ్ వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు చేయవచ్చు అనే నమ్మకం ఏర్పడింది అని జక్కన్న అన్నారు. రాజమౌళి నెక్స్ట్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండబోతోంది. ప్రపంచం మొత్తం చుట్టేసే సాహసికుడు కథ ఈ చిత్రం అని జక్కన్న హింట్ కూడా ఇచ్చారు. మరి ఈ మూవీతో పూర్తి స్థాయిలో జక్కన్న హాలీవుడ్ ని టార్గెట్ చేస్తాడేమో చూడాలి.

click me!