జయలలిత తరువాత... ఇందిరాగాంధీ గా కంగనా రనౌత్

Published : Jan 29, 2021, 09:40 PM IST
జయలలిత తరువాత... ఇందిరాగాంధీ గా కంగనా రనౌత్

సారాంశం

తొలి భారత మహిళా ప్రధానిగా పదవి చేపట్టి, దేశ రాజకీయాలను శాసించిన ఇందిరా గాంధీ పాత్రను కంగనా రనౌత్ చేస్తున్నారట. ఈ విషయంపై కంగనాను సంప్రదించగా ఆమె స్పష్టత ఇచ్చారు. 

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు చాలా ఫేమస్. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన తను వెడ్స్ మను, క్వీన్, మణికర్ణిక భారీ విజయాలు అందుకొన్నాయి. ప్రస్తుతం ఆమె తమిళ రాజకీయ సంచలనం జయలలిత బయోపిక్ లో నటిస్తున్నారు. తలైవి పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జయలలితగా కంగనా రనౌత్ కనిపించనున్నారు. దర్శకుడు ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. 

తలైవి మూవీలో ఎంజీఆర్ గా టాలెంటెడ్ నటుడు అరవింద స్వామి చేస్తున్నారు. కాగా మరో పవర్ ఫుల్ లేడీ రోల్ లో కంగనా కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలి భారత మహిళా ప్రధానిగా పదవి చేపట్టి, దేశ రాజకీయాలను శాసించిన ఇందిరా గాంధీ పాత్రను కంగనా రనౌత్ చేస్తున్నారట. ఈ విషయంపై కంగనాను సంప్రదించగా ఆమె స్పష్టత ఇచ్చారు. 

ఓ పీరియాడిక్ పొలిటికల్ డ్రామాలో తాను నటిస్తున్నట్లు కంగనా తెలియజేశారు. అయితే ఇది ఇందిరా గాంధీ బయోపిక్ కాదు. ఒకప్పటి రాజకీయ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం. స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ సెట్స్ పై వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుందని ఆమె అన్నారు. ఇక ఇటీవల కంగనా బాలీవుడ్ తో పాటు, మహారాష్ట్ర గవర్నమెంట్ పై పెద్ద యుద్ధం చేయడంతో పాటు, వారిపై తీవ్ర విమర్శలు చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా
అఖండ 2 కు ఎదురుదెబ్బ, బాలయ్య సినిమా వసూళ్లలో భారీ పతనం, 4వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?