లెజెండరీ మ్యూజీషియన్‌ ఏఆర్ రెహమాన్‌కు హైకోర్టు నోటీసులు

By Satish ReddyFirst Published Sep 11, 2020, 2:54 PM IST
Highlights

ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌ అధికారి టీఆర్‌ సెంథిల్ మాట్లాడుతూ.. ఏఆర్‌ రెహమాన్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ చెందిన లిబ్రా అనే కంపెనితో 2011-12 సంవత్సరంలో మూడేళ్ల కాంట్రక్ట్‌ను సైన్ చేశాడు. ఆ కంపెనీకి ఎక్స్‌క్లూజివ్‌ రింగ్‌టోన్స్‌ను కంపోజ్‌ చేసి ఇచ్చేందుకు రెహమాన్‌ అగ్రిమెంట్ చేసుకున్నాడు.

లెజెండరీ మ్యూజీషియన్‌ ఏఆర్‌ రెహమాన్‌కు వ్యతిరేకంగా ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ మద్రాస్‌ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. రెహమాన్‌ తన సంపాదనలో దాదాపు 3 కోట్ల మొత్తానికి ట్యాక్స్‌ కట్టకుండా ఆ డబ్బును తన ఛారిటబుల్ ట్రస్ట్ కింద చూపించినట్టుగా ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు శుక్కవారం చెన్నై హైకోర్టు రెహమాన్‌కు నోటీసుల జారీ చేసినట్టుగా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది.

ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌ అధికారి టీఆర్‌ సెంథిల్ మాట్లాడుతూ.. ఏఆర్‌ రెహమాన్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ చెందిన లిబ్రా అనే కంపెనితో 2011-12 సంవత్సరంలో మూడేళ్ల కాంట్రక్ట్‌ను సైన్ చేశాడు. ఆ కంపెనీకి ఎక్స్‌క్లూజివ్‌ రింగ్‌టోన్స్‌ను కంపోజ్‌ చేసి ఇచ్చేందుకు రెహమాన్‌ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అందుకోసం 3.47 కోట్ల రూపాయల పేమెంట్‌ ఇచ్చేందుకు సదరు కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు రెహమాన్‌.

అయితే ఒప్పందం ప్రకారం తనకు రావాల్సి మొత్తాన్ని సొంత అకౌంట్‌కు కాకుండా ఏఆర్ రెహమాన్‌ ఫౌండేషన్‌ అకౌంట్‌లో వేసేలా రెహమాన్‌ లిబ్రా సంస్థకు సూచించాడని ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే సదరు సంస్థకు విదేశాల నుంచి డొనేషన్‌ పొందేందుకు అనుమతులు లేకపోయినా రెహమాన్‌ ఆ డబ్బును తన ట్రస్ట్‌ ద్వారా తీసుకోవటం చట్ట రీత్యా నేరం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

click me!