నేను కూడా కాస్టింగ్ కౌచ్ భారిన పడ్డాను : సనాఖాన్

Published : Mar 15, 2018, 10:38 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
నేను కూడా కాస్టింగ్ కౌచ్ భారిన పడ్డాను : సనాఖాన్

సారాంశం

ఇప్పుడు సినీ ప్రపంచం మొత్తం ఎక్కడ విన్నా.. 'కాస్టింగ్ కౌచ్' గురించే చర్చ బాలీవుడ్ హీరోయిన్ సనా ఖాన్ కూడా తాజాగా దీనిపై స్పందించారు​ సినిమాల్లోకి వచ్చాక తనకూ ఇలాంటి అనుభవాలు తప్పలేదని వెల్లడించారు

ఇప్పుడు సినీ ప్రపంచం మొత్తం హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఇప్పుడెక్కడ విన్నా.. 'కాస్టింగ్ కౌచ్' గురించే చర్చ. బాలీవుడ్ హీరోయిన్ సనా ఖాన్ కూడా తాజాగా దీనిపై స్పందించారు. సినిమాల్లోకి వచ్చాక తనకూ ఇలాంటి అనుభవాలు తప్పలేదని వెల్లడించారు.. 'సముద్రంలోనే ఉండి షార్క్‌లతో పోరాడటం కష్టం' అని సనాఖాన్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంటే, ఇండస్ట్రీలో ఉంటూ కొంతమందికి వ్యతిరేకంగా నోరు విప్పడం కష్టం అని ఆమె పరోక్షంగా చెప్పుకొచ్చారన్నమాట. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లాంటి విషయాల గురించి ప్రస్తావించి.. తమ అవకాశాలను వదులుకోవడానికి చాలామంది నటీమణులు సిద్దంగా లేరని సనాఖాన్ చెప్పడం గమనార్హం.

'ఇండస్ట్రీలో అంతా దిగజారుడు వ్యక్తులే ఉంటారని చెప్పడానికి లేదు. కొంతమంది మంచివాళ్లు కూడా ఉన్నారు. కాబట్టి చీప్ పర్సనాలిటీల గురించి పట్టించుకోకుండా ప్రతీసారి నమ్మకంతో ముందుడగు వేయాల్సిందే. ఎవరి పేరో ప్రస్తావించి వివాదంలో ఇరుక్కోవడం ఎందుకు?' అంటూ సనాఖాన్ అభిప్రాయపడ్డారు. మీరెప్పుడైనా 'కాస్టింగ్ కౌచ్' పరిస్థితిని ఎదుర్కొన్నారా? అని ప్రశ్నించగా.. 'తప్పదు, చాలాసార్లు అలాంటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి కొంతమంది ప్రయత్నించారు. ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని బయటి వ్యక్తుల నుంచే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని నేను అనుకుంటాను.' అని సనాఖాన్ బదులిచ్చారు.

 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి