'ఇస్మార్ట్ శంకర్' ట్విట్టర్ టాక్!

Published : Jul 18, 2019, 09:22 AM IST
'ఇస్మార్ట్ శంకర్' ట్విట్టర్ టాక్!

సారాంశం

*ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది.  * ఈ సినిమా హిట్ కొట్టామని రామ్ అభిమానులు ట్వీట్లు చేస్తుంటే బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ మరికొంత మంది అంటున్నారు. 

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ లు, టీజర్ లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

సినిమాకి 'A' సర్టిఫికేట్ రావడంతో యూత్ లో క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పటికే ఈ సినిమా షోలు అమెరికా లాంటి ప్రాంతాల్లో ప్రదర్శించడంతో సినిమా టాక్ ఏంటో బయటకి వచ్చింది. కొందరు సినిమా బాగుందని చెబుతుంటే.. మరికొందరు మాత్రం పూరికి మరో ఫ్లాప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

టైటిల్ సాంగ్, దిమాఖ్ ఖరాబ్ వంటి పాటల్లో డాన్స్ కుమ్మేశారని.. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ చాలా బాగుందని.. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదుర్స్ అంటూ ట్వీట్ లు చేస్తున్నారు. కొందరు మాత్రం సినిమా అసలు బాగాలేదని పూరికి మరో ఫ్లాప్ అని అంటున్నారు. 

 

 

 

PREV
click me!

Recommended Stories

దళపతి విజయ్ అభిమానులకు సుధా కొంగర వార్నింగ్, పరాశక్తి పై నెెగెటీవ్ ప్రచారం జరుగుతుందా?
ఎన్టీఆర్ , ఎస్వీఆర్ మధ్య చిచ్చుపెట్టిన డైలాగ్ ఏదో తెలుసా? 3 ఏళ్లు ఇద్దరి మధ్య మాటలు ఎందుకు లేవు?