స్టార్ హీరోయిన్ పై కంప్లైంట్.. చర్యలు తీసుకోవాలని డిమాండ్!

By AN TeluguFirst Published 18, Jul 2019, 9:05 AM IST
Highlights

*అమలాపాల్ నటించిన 'ఆమె' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
*ఈ సినిమాలో అమలాపాల్ నగ్నంగా నటించిన కారణంగా ఆమెపై చాలా విమర్శలు వినిపించాయి.  
*ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు కీడు చేసేవిగా ఉన్నాయని .. కాబట్టి వాటిపై నిషేధం విధించాలని కోరుతూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది నటి అమలాపాల్. భర్తతో విడాకులతో అప్పట్లో వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ ఆ తరువాత కొన్ని వివాదాలతో వార్తల్లోకెక్కింది. ఇటీవల తన భర్త రెండో పెళ్లిపై కామెంట్స్ చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'ఆమె' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమాలో అమలాపాల్ నగ్నంగా నటించింది. ఇదే ఇప్పుడు వివాదాలకు కారణమవుతోంది. అమలాపాల్ నగ్నంగా నటించిన సన్నివేశాలు, పోస్టర్లు ఇప్పటికే వివాదంగా మారాయి. అమలాపాల్ మాత్రం తను నగ్నంగా నటించడాన్ని సమర్ధించుకుంటోంది.

సినిమాకి అలాంటి సన్నివేశం అవసరమైందని.. అవి అసభ్యంగా మాత్రం ఉండవని చెబుతోంది. అయితే నగ్నంగా నటించి అసభ్యంగా ఉండవని చెప్పడాన్ని కొందరు హర్షించడం లేదు. అమలాపాల్ నటించిన 'ఆమె' సినిమాలో నగ్న దృశ్యాలు, ఆ సినిమా పోస్టర్లు సమాజానికి కీడు చేసేవిగా ఉన్నాయని .. కాబట్టి వాటిపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నైకి చెందిన రాజేశ్వరి ప్రియ అనే మహిళ బుధవారం చెన్నైలోని డీజీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేసింది.

సినిమాపై తగిన చర్యలు తీసుకోవాలని.. లేదంటే తాము ఆందోళనకు దిగుతామని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొంది. విడుదలకు ఎలాంటి అడ్డులేనప్పటికీ.. మరి ఎలాంటి వ్యతిరేకత ఏర్పడుతుందో చూడాలి!

Last Updated 18, Jul 2019, 9:05 AM IST