'ఇస్మార్ట్ శంకర్' ఫస్ట్ లుక్!

Published : Jan 24, 2019, 04:28 PM IST
'ఇస్మార్ట్ శంకర్' ఫస్ట్ లుక్!

సారాంశం

ఎనర్జిటిక్ హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా షూటింగ్ నేడు మొదలైంది.

ఎనర్జిటిక్ హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా షూటింగ్ నేడు మొదలైంది. 'డబుల్ ధమాకా దిమాక్' అనే క్యాప్షన్ తో వస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.

ఇందులో రామ్ చేతిలో గన్ పట్టుకొని నోట్లో సిగరెట్ పెట్టుకొని మాస్ డ్రెస్సింగ్ స్టైల్ లో కనిపించాడు. రామ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విభిన్నంగా కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు.

ఈ షెడ్యూల్ లో హీరో రామ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అను ఎమ్మాన్యుయల్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించనున్నారు. మే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు  తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?