ఇస్మార్ట్ ఎఫెక్ట్.. మాస్ కథలే కావాలి

Published : Aug 08, 2019, 04:22 PM IST
ఇస్మార్ట్ ఎఫెక్ట్.. మాస్ కథలే కావాలి

సారాంశం

మొన్నటివరకు అపజయాలతో సతమతమైన యువ హీరో రామ్ ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫామ్ లోకి వచ్చేశాడు. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో కెరీర్ ను ఇదే ఫ్లోలో కొనసాగించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. తన దగ్గరకు వచ్చే దర్శకులకు రామ్ ఒక విషయాన్నీ బలంగా చెబుతున్నాడ

మొన్నటివరకు అపజయాలతో సతమతమైన యువ హీరో రామ్ ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫామ్ లోకి వచ్చేశాడు. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో కెరీర్ ను ఇదే ఫ్లోలో కొనసాగించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. తన దగ్గరకు వచ్చే దర్శకులకు రామ్ ఒక విషయాన్నీ బలంగా చెబుతున్నాడట. 

ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత తనపై ఆడియెన్స్ లో అంచనాలు మరింతగా పెరిగాయి కాబట్టి మాస్ కథలు ఉంటే తీసుకురావాలని చెబుతున్నాడట. కానీ చాలా మంది రామ్ కి లవ్ స్టోరీలు సెట్టవుతాయని వస్తుండడంతో వారి కథలను వినకుండానే మాస్ కథ అయితేనే చెప్పండి అని రామ్ గుర్తు చేస్తున్నాడట. దీంతో దర్శకులు రామ్ కోసం మరో కథను రెడీ చేసుకుంటున్నాని టాక్.

రీసెంట్ గా వచ్చిన ముగ్గురు ప్రముఖ దర్శకులకు కూడా రామ్ అదే చెప్పాడని తెలుస్తోంది. ఇకపోతే రామ్ తో రెండు సినిమాలు చేసిన కిషోర్ తిరుమల నెక్స్ట్ రామ్ తో వర్క్ చేయాలనీ అనుకుంటున్నాడు. కానీ రామ్ ఏమో ఇస్మార్ట్ ఎఫెక్ట్ కారణంగా ఓన్లీ ఊర మాస్ కథలు కావాలని బోర్డు పెట్టేశాడట. దీంతో ఈ క్లాస్ దర్శకుడు కూడా కథను రామ్ కోసం మారుస్తున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

రికార్డులకు పాతరేసిన మన శంకర వరప్రసాద్ గారు, ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలయ్య, వెంకీ, నాగ్ లకు సాధ్యంకాని ఘనత
షాపింగ్ మాల్‌లో ప్రేమ‌, ల‌క్ష‌ల్లో ఒక‌రికి వ‌చ్చే అరుదైన వ్యాధి.. పెద్ది రెడ్డి సింగ‌ర్ జీవితంలో సినిమాను మించిన ట్విస్టులు