మహేష్ వెంటపడుతున్న బాహుబలి నిర్మాతలు?

Published : Aug 08, 2019, 03:52 PM IST
మహేష్ వెంటపడుతున్న బాహుబలి నిర్మాతలు?

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయడానికి నిర్మాతల క్యూ ఎప్పుడు పెద్దగానే ఉంటుంది. కానీ మహేష్ ఎవరితో చేస్తాడు అనేది సినిమా స్టార్ట్ అయ్యేవరకు ఎవరికీ తెలియదు. నెక్స్ట్ ప్రిన్స్ 27వ సినిమా ఎవరితో చేయబోతున్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

కానీ మహేష్ మాత్రం ఆ సంగతి పట్టించుకోకుండా సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా మారాడు. ప్రస్తుతం బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా మహేష్ తో సినిమా చేయాలనీ ఉవ్విళ్లూరుతోంది. శోబు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని గత కొంత కాలంగా మహేష్ తో చర్చలు జరుపుతూనే ఉన్నారు. దర్శకుడు రాజమౌళి RRR తరువాత రెడీగా ఉంటాడని మహేష్ ను టెంప్ట్ చేస్తున్నారట.

ఒకవేళ జక్కన్నటీతో కుదరకపోయినా వేరే దర్శకులతో మహేష్ సినిమాను నిర్మించాలని అనుకుంటున్నారట. కానీ మహేష్ మాత్రం ఇంకా ఏ నిర్ణయాన్ని చెప్పడం లేదు. మరోవైపు రాజమౌళి కూడా మహేష్ తో సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు. అందుకే ఈ కాంబోని దక్కించుకునేందుకు ఆర్కా మీడియా మహేష్ వెంటపడుతోంది. ఈ కలయికపై ఓ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌