షాకింగ్: త్వరలో పెళ్లి, ఈలోగా యాక్సిడెంట్, నటి మృతి

Surya Prakash   | Asianet News
Published : Sep 22, 2021, 10:56 AM IST
షాకింగ్: త్వరలో పెళ్లి, ఈలోగా యాక్సిడెంట్,  నటి మృతి

సారాంశం

ట్రిప్‌కి వెళ్లి సంతోషంగా తిరిగి వస్తారనుకుంటే శవమై తేలడం బంధువులను, స్నేహితులను షాక్‌కి గురిచేస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.   

త్వరలోనే తన లవర్ తో వివాహం. నిశ్చితార్ధానికి ఏర్పాట్లు జరుగుతన్నాయి. ఈ లోగా లవర్ తో  కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లిన ఆ నటి కారు ప్రమాదంలో మృతి చెందింది. ఈ క్రమంలో కారు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ట్రిప్‌కి వెళ్లి సంతోషంగా తిరిగి వస్తారనుకుంటే శవమై తేలడం బంధువులను, స్నేహితులను షాక్‌కి గురిచేస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరాఠీ నటి ఈశ్వరి ప్రియుడితో కలిసి సెప్టెంబర్‌ 15న గోవా హాలీడే ట్రిప్‌కు వెళ్లింది. సోమవారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు అర్పారో గ్రామానికి సమీపంలోని బాగా-కలాంగుట్‌ వంతెనపై అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. కారు సెంట్రల్ లాక్ చేసి ఉండడంతో ఇద్దరూ కారులోంచి బయటకు రాలేకపోయారు. ఈ ప్రమాదంతో హీరోయిన్ ఈశ్వరి(25)తోపాటు ఆమె ప్రియుడు శుభమ్ డెడ్జ్ (28) కూడా ప్రాణాలు  కోల్పోయారు.

చిన్నతనం నుంచి నటిగా రాణించాలని కలలుగన్న ఈశ్వరిదేశ్ పాండే పలు హిందీ మరాఠీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా హీరోయిన్ ప్రాణాలు
కోల్పోవడం విషాదం నింపింది. ఇక శుభమ్ తో ఈశ్వరికి చాలా రోజులుగా పరిచయం ఉంది. వీరి స్నేహం ఇటీవలే ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో వీరి నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కారు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
 

PREV
click me!

Recommended Stories

Thanuja: ఇదీ తనూజ అసలు స్వరూపం, విన్నర్ అయ్యే ఛాన్స్ గోవిందా.. ఆమెకి ఎలివేషన్స్ ఇచ్చి వేస్ట్
Raktha Sambandham Review : ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి