షాకింగ్.. రోబోని తలదన్నేలా 'RC15'.. ఒక్క ఫైట్ కోసం దాదాపు రూ.10 కోట్లు

By telugu teamFirst Published Sep 22, 2021, 9:50 AM IST
Highlights

మెగా పవర్ సార్ రాంచరణ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ఆర్సీ 15( వర్కింగ్ టైటిల్). దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ అయింది.

మెగా పవర్ సార్ రాంచరణ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ఆర్సీ 15( వర్కింగ్ టైటిల్). దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ అయింది. రాజమౌళి, చిరంజీవి ఈ చిత్ర లాంచింగ్ కు అతిథులుగా హాజరయ్యారు. 

ఇక ఈ చిత్రం శంకర్ స్టైల్ లో సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపి ఉంటుందని, పొలిటికల్ టచ్ ఎక్కువగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. శంకర్ చిత్రాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అపరిచితుడులో కరాటే ఫైట్.. రోబోలో ట్రైన్ ఫైట్ లాంటి సన్నివేశాలు ప్రేక్షకులని బాగా థ్రిల్ చేశాయి. అదే తరహాలో ఈ మూవీలో కూడా శంకర్ భారీ ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ ని డిజైన్ చేస్తున్నారట. దీని కోసం ప్రత్యేకంగా ట్రైన్ సెట్ ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. 

కళ్ళు చెదిరేలా ఉండబోయే ఈ ఫైట్ లో వందలాది మంది ఫైటర్స్ రాంచరణ్ తో తలపడనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క సీన్ కోసం శంకర్ అండ్ టీం 8 నుంచి 10 కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నట్లు టాక్. అంత బడ్జెట్ లో శంకర్ తెరకెక్కించబోయే యాక్షన్ సీన్ థియేటర్స్ లో చరణ్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. 

తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. వినయ విధేయ రామ తర్వాత కియారా అద్వానీ ఈ చిత్రంలో చరణ్ తో రొమాన్స్ చేస్తోంది. సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. ఈ మూవీలో సునీల్, మలయాళీ నటుడు జయరాం, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

click me!