Samantha : ఫ్రీ బర్డ్ లైఫ్... సమంత కోరుకున్నది ఇదేనా?

Published : Dec 29, 2021, 09:55 AM IST
Samantha : ఫ్రీ బర్డ్ లైఫ్... సమంత కోరుకున్నది ఇదేనా?

సారాంశం

భర్తగా సమంతకు చైతు(Nnaga Chaitanya) ఎంత స్వేచ్ఛ ఇచ్చినా.. అక్కినేని వారి కోడలు అనే బ్రాండ్ నేమ్ ఆమెకు కనిపించని సంకెళ్లు వేసింది. సమంత ఏం చేసినా అక్కినేని కుటుంబ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి.

స్టార్ డమ్, సంపాదన కోసం నటులు వెంపర్లాడుతూ ఉంటారు. దాని కోసం కష్టాలు, నష్టాలు, అవమానాలు, కన్నీళ్లు ఎన్నో ఎదుర్కొంటారు. స్టార్ డమ్ ద్వారా వచ్చే లగ్జరీ లైఫ్ కోసం చాలా త్యాగాలు చేస్తారు. హీరోయిన్ గా వెలిగిపోవాలన్న అమ్మాయిల అంతిమ లక్ష్యం ఆనందం, సంతోషమే. ఒక్కసారి స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంటే కో అంటే కోట్లు వస్తాయి. కాలు కదిపితే డబ్బుల వర్షం కురుస్తుంది. సినిమాలకు మించిన డబ్బులు ఈవెంట్స్, బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా సంపాదించవచ్చు. 

మరి ఇంత సంపాదన, డబ్బు ఉన్నా.. దానిని అనుభవించాలి అంటే స్వేచ్ఛ కావాలి. స్టార్స్ గా వెలిగిపోతున్న కొంత మంది హీరోయిన్స్ కి ఇది ఉండదు. వాళ్ళు తల్లిదండ్రుల నిబంధనలకు లోబడి బ్రతకాల్సి ఉంటుంది. ఇక పెళ్ళైతే భర్త అదుపాజ్ఞలలో నడవాలి. 

సమంత (Samantha)కు ఈ విషయంలో ఫుల్ ఫ్రీడమ్ ఉంది. పెళ్లి తర్వాత కూడా సమంత నచ్చిన సినిమాలు చేశారు. కొన్ని బోల్డ్ రోల్స్ లో కూడా నటించారు. సమంతను ప్రేమించినవాడిగా ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. భర్తగా సమంతకు చైతు(Nnaga Chaitanya) ఎంత స్వేచ్ఛ ఇచ్చినా.. అక్కినేని వారి కోడలు అనే బ్రాండ్ నేమ్ ఆమెకు కనిపించని సంకెళ్లు వేసింది. సమంత ఏం చేసినా అక్కినేని కుటుంబ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ముఖ్యంగా పబ్లిక్ డొమైన్ లో ఆమె చాలా పద్దతిగా ప్రవర్తించాలి. 

ఈ ఒక్క కండీషన్ సమంతను ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. విడాకుల తర్వాత డిప్రెషన్ అనుభవించిన సమంత.. దాని నుండి బయటికి వచ్చాక స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆమె వరుస విహారాలతో అంతులేని ఆనందం అనుభవిస్తున్నారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం వారం రోజుల ముందే తన ఫ్రెండ్ శిల్పారెడ్డితో పాటు గోవా చెక్కేశారు. 

Also read Naga Chaitanya: నాగచైతన్య ఎలాంటివాడంటే..? వైరల్ అవుతున్న పోస్ట్.

ఇక గోవాలో అందమైన ప్రదేశాల్లో విహరిస్తున్నారు. జలపాతాలలో బికినీలో జలకాలు ఆడుతున్నారు. 2022 (New Year 2022) ని సరికొత్తగా ప్రారంభించాలని సమంత కోరుకుంటున్నారు. 2021 మిగిల్చిన చేదు అనుభవాల నుండి బయటపడి కొత్త జీవితం వైపు అడుగులు వేయాలని చూస్తున్నారు. చైతూ నుండి విడాకుల ద్వారా సమంత కోరుకున్న జీవితం కూడా ఇదేనేమో అనిపిస్తుంది. 

Also read Samantha:‘యశోద’లో సమంత చేస్తున్న పాత్ర..షాకింగ్
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?