Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఇదేనా! మరీ ప్రమోషన్స్ సంగతేంటి.?

Published : Apr 24, 2022, 04:25 PM ISTUpdated : Apr 24, 2022, 04:39 PM IST
Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఇదేనా! మరీ ప్రమోషన్స్ సంగతేంటి.?

సారాంశం

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్ర  షూటింగ్ రెండు రోజుల కిందనే పూర్తయ్యింది.  ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్స్ పై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మహేశ్ బాబు దుబాయ్ కి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.  

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకుడు పరుశురామ్ పెట్ల కాంబినేషన్ లో వస్తున్న  మాస్ అండ్ యాక్షన్ డ్రామా ‘సర్కారు వారి పాట’. చివరిగా మహేశ్ బాబు డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఆడియెన్స్ ను, తన అభిమానులను అలరించాడు. రెండేండ్ల తర్వాత మళ్లీ Sarkaru Vaari Paataతో మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్నారు. ఈ చిత్రంలో ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా.. పెద్ద సినిమాల పోటీ, కోవిడ్ పరిస్థితుల కారణంగా కాస్తా ఆలస్యమైంది.

అయితే, ఎట్టకేళలకు సర్కారు వారి పాట చిత్ర షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్. ఇప్పటికే అన్ని విధాలా రిలీజ్ కు సిద్ధం చేశారు. ఇప్పటికే వరుస అప్డైట్స్ అందిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన పలు వివరాలు ఇలా ఉన్నాయి. మే 1న  సర్కారు వారి పాట నుంచి మరో మాస్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే మే 5న ట్రైలర్ విడుదల కానుంది. ఆ తర్వాత మే 7న గ్రాండ్ గా విజయవాడలోని అలంకార్ సెంటర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించున్నారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు మహేశ్ బాబు ఈ రోజే హైదరాబాద్  ఎయిర్ పోర్ట్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. మరికొద్ది రోజుల్లో తన సినిమా రిలీజ్ ఉన్నప్పటికీ దుబాయ్ కి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే మహేశ్ బాబు లేకుండా సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ ఎలా నిర్వహిస్తుందనే ఆందోళన నెలకొంది. ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించి గ్రౌండ్ లెవల్ ప్రమోషన్స్ ను కూడా నిర్వహించలేదు.  మహేశ్ బాబు తన ట్రిప్ కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చాకే సర్కారు వారి పాట అసలు ప్రమోషన్స్ షురూ కానున్నట్టు తెలుస్తోంది. మే 3న మహేశ్ హైదరాబాద్ కు రానున్నట్టు సమాచారం. 

ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఆడిపాడింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?