డీజే టిల్లు షాకింగ్ నిర్ణయం, హిట్ ఇచ్చిన వాళ్లకే హ్యాండ్ ఇచ్చిన సిద్ధు జొన్నలగడ్డ...?

Published : Apr 24, 2022, 03:20 PM IST
డీజే టిల్లు షాకింగ్ నిర్ణయం,  హిట్ ఇచ్చిన వాళ్లకే హ్యాండ్ ఇచ్చిన  సిద్ధు జొన్నలగడ్డ...?

సారాంశం

సిద్ధు జొన్నల గడ్డ పరిచయం అక్కర్లేని పేరు. హీరోగా కెరీర్ లో సెటిల్ అవ్వడం కోసం చాలా కాలంగా కష్టపడుతున్నయంగ్ హీరో. ఇప్పటికే చాలా సినిమాలు చేశాడు, హీరో మెటీరియల్ అని నిరూపించుకున్నాడు. కాని రీసెంట్ గావచ్చిన డీజే టిల్లు సినిమాతో క్రేజీ హీరోగా మారాడు సిద్థు. ఇక ఈ హీరో తనకు క్రేజ్ రావడంతో సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.   

సిద్ధు జొన్నలగడ్డ ఇంతకుముందు కొన్ని సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమాలు ఆయన కెరియర్ కి అంతగా హెల్ప్ కాలేదు. ఈ మధనే సితార బ్యానర్లో  ఆయన చేసిన డీజే టిల్లు మాత్రం సూపర్ హిట్ అవ్వడమే కాదు.. ఈ సినిమా యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. సిద్ధు జొన్నలగడ్డపై క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతగా సిద్ధుపాత్ర జనాలకు కనెక్ట్ అయ్యింది.

అయితే  ఇక్కడే వచ్చింది చిక్కంతా.. డీజే టిల్లు సినిమా నిర్మించిన అదే బ్యానర్లో మరో సినిమాను చేయడానికి సిద్ధు ముందుగానే ఓకే చెప్పేశాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన కప్పెలా సినిమా రీమేక్ ను సిద్ధుతో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు టీమ్. ఇక ఈసినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అనైక సురేంద్రన్ ను కూడా తీసుకున్నారు. ఈ సినిమాతో  శౌరి చంద్రశేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 

అయితే ఈసినిమా నుంచి రీసెంట్ గా సిద్ధు తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సిద్ధు పాత్రను డిజైన్ చేసిన తీరు డిఫరెంట్ గా ఉంటుంది. అయితే డీజే టిల్లు తో వచ్చిన క్రేజ్ వల్ల ఈసినిమాలో చేస్తున్న పాత్రతె కెరీర్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉన్నట్టు భావించాడట సిద్ధు.ఈ పరిస్థితుల్లో  ఈ పాత్రను చేయడం కరెక్ట్ కాదనిపించడంతో, ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నాడని సమాచారం. ఆల్రెడీ షూటింగ్ జరుగుతూ ఉండగా ఆయన తప్పుకోవడంతో, ఇప్పుడు ఇంకో హీరో కోసం వెదుకుతున్నారట మేకర్స్.

ఇక డీజే టిల్లు తరువాత సిద్ధు జొన్నలగడ్డకు వరుస ఆఫర్లు వెంట వస్తున్నాయి. ముఖ్యంగా ఈ హీరో ఆటిట్యూడ్ కు, డైలాగ్ డెలివరీకి, కామెడీ టైమింగ్ కు ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్. దాంతో సిద్దుకి అవకాశాలు పెరిగిపోయాయట. వరుసగా సినిమా ఆఫర్లు చుట్టుముడుతున్నట్టు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?