శ్రీదేవిపై విష ప్రయోగం జరిగిందా?

First Published Feb 27, 2018, 3:49 PM IST
Highlights
  • శ్రీదేవి మృతిపై అనుమానాలు
  • పెళ్లిలో విష ప్రయోగం జరిగిందా
  • అనుమానాల్లో ఏది నిజం

అందాలరాశి శ్రీదేవి తన అద్భుత సౌందర్యంతోనే కాక నటనతో భారతీయ చలన చిత్ర పరిశ్రమల్లో మరెవరికీ సాధ్యంకాని తారగా.. వెండితెరను తన పాదాక్రాంతం  చేసుకుంది. ఈ సాయంత్రం 5గంటలకు శ్రీదేవి మృత దేహం దుబయి నుంచి ఓ ప్రయివేటు విమానంలో... రాత్రి 10 గంటలకు ముంబయి చేరుకుంటుంది.

 

ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చిన దుబయి అధికారులు.. కేసు విచారణ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక ప్రస్థుతం శ్రీదేవి భౌతిక కాయానికి ఎంబామింగ్(శరీరాన్ని భద్రపరిచే ప్రక్రియ) కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే నేరుగా శ్రీదేవి భౌతిక కాయాన్ని ముంబై తరలిస్తారు.

 

ఇక శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్ మోతాదు వుందని పేర్కొన్న దుబయి వైద్యులు ఆ ఆల్కహాల్ ఏ మేరకు వుంది.. దానివల్లే శ్రీదేవి బాత్ టబ్ లో మునిగి చనిపోయారా.. లేక తిరిగిరాని లోకాలకు వెళ్లిన శ్రీదేవిపై విష ప్రయోగం ఏదైనా జరిగిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే శ్రీదేవికి మద్యం అలవాటు లేదని అంటుంటే.. తన శరీరంలో మద్యం ఆనవాళ్లు ఎందుకు వచ్చాయి.. వస్తే ఏ మోతాదులో మద్యం తీసుకుంది.. మద్యం మాత్రమే తీసుకుందా.. ఏదైనా విష ప్రయోగం జరిగిందా అనే అనుమానాలు మాత్రం అలాగే వున్నాయి. మిలియన్ డాలర్ల ప్రశ్నలెన్నో తలెత్తుతున్న శ్రీదేవి డెత్ మిస్టరీలో చివరకు ఏం తేలుతుందో చూడాలి.

 

మేనల్లుడి పెళ్లిలో... అవమానాలు ఎదుర్కొందని, అందుకే రెండు రోజులపాటు శ్రీదేవి హోటల్ గదిలోంచి బయటికి కూడా రాలేదని.. కూడా వినిపిస్తున్న నేపథ్యంలో శ్రీదేవి ఆత్మహత్య చేసుకుందా లేక ప్రమాదవశాత్తు మరణించిందా అని అనుమానాలు తలెత్తుతున్నాయి. శ్రీదేవి అభిమానులు మాత్రం ఆమె మరణాన్ని జీర్ణించుకకోలేకపోతున్నారు.

click me!