"జగన్ అను నేను" పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ

First Published Mar 7, 2018, 1:41 PM IST
Highlights
  • రాజకీయాలకు , సినీ రంగానికి అవినాభావ సంబంధం
  • పలు సందర్భాల్లో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సినిమాలు
  • తాజాగా రాజకీయాలపై వచ్చిన సినిమా జగన్ పైనే అంటూ రూమర్స్
  • భరత్ అను నేను కథ నేపథ్యంపై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న భరత్ అను నేను విజన్ ఆఫ్ భరత్ నిన్న రిలీజై వైరల్ ఔవుతున్న సంగతి తెలిసిందే. ఈ విడియోలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ తో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కనెక్షన్ వుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సాధారణంగా సినిమాలతో రాజకీయాలకు ముడిపడి వుండటం సహజమే. అయితే ఇలా రాజకీయాలతో లింకుండే సినిమాలు చాలా అరుదు. సాధారణంగా రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు సూపర్ హిట్ టాక్ వుంటుంది.

 

రాజకీయ నేతలతో సినిమా హీరోలకు సంబంధాలుండటం సహజం. టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు కూడా ఇందుకు మినహాయింపేం కాదు. ఇక ట్విటర్ లో మహేష్ బాబు ఫాలో అయ్యే ఏకైక రాజకీయ నేత ఆయన బావ గల్లా జయదేవ్ మాత్రమే. మహేష్ బాబు సోదరి పద్మావతి భర్త అయిన జయదేవ్ టీడీపీలో వున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ ముందు నుంచి కాంగ్రెస్ సభ్యుడైన కృష్ణ వైఎస్ కు ఆకర్షితుడై.. ఆ సంబంధాలు ప్రస్థుతం వైకాపా అధినేతగా వున్న జగన్ కుటుంబంతోనూ కొనసాగిస్తున్నారు.  

 

కృష్ణ కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి వున్న సాన్నిహిత్యం నేపథ్యంలో... భరత్ అను నేను మూవీలో జగన్ కు సపోర్ట్ గా కొన్ని సీన్స్ పెట్టారని వైకాపా, జగన్ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. దీంతో జగన్ అభిమానులు సోషల్ మీడియాలో దీన్ని తెగ ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు “జగన్ అను నేను” అంటూ డైలాగ్ ట్యాగ్ చేసి ప్రచారం చేస్తున్నారు.

 

అయితే ఈ మూవీకి అలాంటి సంబంధం ఏమీ లేదని.. ఈ చిత్రం కేవలం రాజకీయ డ్రామా అని, దీనితో ఏ రాజకీయ పార్టీకి గానీ, నేతకు గానీ సంబంధం లేదని దర్శకుడు కొరటాల శివ తేల్చి చెప్పారు. అంతే కాక ఈ చిత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో రాసుకున్న కథ అని, ప్రస్థుతం వున్న రాజకీయ పరిస్థితులకు, నేతలకు ఈ చిత్రంతో సంబంధం లేదని కొరటాల స్పష్టం చేశారు.

 

ఏదేమైనా రాజకీయంగా మాత్రం ఈ చిత్రాన్ని వుపయోగించుకునేందుకు తమదే అనిపించుకునేందుకు కావల్సినంత ప్రయత్నం ఓ వర్గం అదే పనిగా పనిచేస్కున్నారు.

ఈ క్రింద లింకులో... పవన్ ఇంట విషాదం... వివరాలు  https://goo.gl/WHnKiy

click me!