ప్రదీప్ కి కరోనా, అందుకే ఆయన ప్లేస్ లో రవి?

Published : Apr 23, 2021, 10:09 PM IST
ప్రదీప్ కి కరోనా, అందుకే ఆయన ప్లేస్ లో రవి?

సారాంశం

మరో బుల్లితెర సెలబ్రిటీకి కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ యాంకర్ ప్రదీప్ కి కరోనా సోకిందని అంటున్నారు. కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.

బుల్లి తెర ప్రముఖులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. ఇటీవల జబర్దస్త్ వర్ష కరోనా సోకింది. వీడియో సందేశం ద్వారా వర్ష ఈ విషయం తెలియజేశారు. అలాగే పరిస్థితి దారుణంగా ఉన్నట్లు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మరో బుల్లితెర సెలబ్రిటీకి కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ యాంకర్ ప్రదీప్ కి కరోనా సోకిందని అంటున్నారు. కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రదీప్ స్థానంలో యాంకర్ రవి వచ్చారు.


కరోనా సెకండ్‌ వేవ్‌కి దేశం అతలాకుతలం అవుతోంది. ప్రతి రోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు కర్ప్యూ, లాక్‌డౌన్‌ ప్రకటించినా..కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమపై కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి మృతి చెందారు. కొంతమంది ఇప్పటికీ ఐసోలేషన్‌ల్లో ఉన్నారు.

అనేక చిత్రాల షూటింగ్స్ నిలిచిపోయాయి. చిరంజీవి ఆచార్యతో పాటు భారీ చిత్రాల షూటింగ్స్ నిలిచిపోయాయి. చిత్ర పరిశ్రమలో గత ఏడాది కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులు మరలా ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక సినీ కార్మికులు కరోనా కరోనా బారినపడకుండా సీసీసీ తరపున ఉచిత కరోనా వాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు.

PREV
click me!

Recommended Stories

Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌
Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?