మోడీకి షాక్‌ ఇవ్వబోతున్న షారూఖ్‌.. అది నిజమేనా?

Published : Aug 08, 2020, 09:01 AM IST
మోడీకి షాక్‌ ఇవ్వబోతున్న షారూఖ్‌.. అది నిజమేనా?

సారాంశం

కరోనా సమయంలో కూడా అంగరంగ వైభవంగా ఈ మందిర నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రపంచం సైతం ఒక్కసారిగా భారత్‌ వైపు చూసేలా చేశారు. వందల కోట్లతో ఈ మందిరానికి సంబంధించిన నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో రామమందిరం అంటే హిందూలకే పరిమితం అనే నానుడి ఉంది. అయితే ఈ విషయంలో బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌..షారూఖ్‌ మోడీకి షాక్‌ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇటీవల ప్రధాని మోడీ భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో కూడా అంగరంగ వైభవంగా ఈ మందిర నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రపంచం సైతం ఒక్కసారిగా భారత్‌ వైపు చూసేలా చేశారు. వందల కోట్లతో ఈ మందిరానికి సంబంధించిన నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో రామమందిరం అంటే హిందూలకే పరిమితం అనే నానుడి ఉంది. అయితే ఈ విషయంలో బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌..షారూఖ్‌ మోడీకి షాక్‌ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. 

రామాల‌యం నిర్మాణం కోసం ఐదు కోట్ల రూపాయ‌ల‌ను ఇస్తున్న‌ట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ మేర‌కు రామ మందిర ట్ర‌స్టుకు డ‌బ్బులు ఇవ్వ‌నున్నాడంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. షారుక్ ఖాన్ కంపెనీ రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో సీనియ‌ర్ మేనేజ‌ర్ ఈ  విష‌యాన్ని వెల్ల‌డించారంటూ వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది.

దీనిపై షారూఖ్‌ నిర్మాణ సంస్థ స్పందించింది. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇందులో నిజం లేదని తేల్చిపారేసింది. అలాగే దైనిక్ భాస్క‌ర్ మీడియాలో షారుక్ విరాళం ఇచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోన్న వార్త నిజం కాద‌ని, కావాల‌ని ఎడిటింగ్ చేసి ప్ర‌చారం చేశార‌ని అంటున్నారు. షారూఖ్‌ స్థాయి స్టార్‌ హీరో విరాళం ప్రకటిస్తే అది కచ్చితంగా సంచలనం అవుతుంది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగానూ మారుతుంది. పైగా హిందూ, ముస్లీం అనే భేదాలు నెలకొన్న ఈ పరిస్థితుల్లో షారూఖ్‌ అంత భారీ విరాళం ప్రకటించడం అనేది నిజంగానే అదో సంచలన వార్త అవుతుంది. అవేవి ఇప్పుడు కనిపించడం లేదు. అయితే నిప్పు లేనిదే పొగరాదనే నానుడి కూడా ఉంది. షారూఖ్‌కి ఆ ఆలోచన ఉందేమో?. మరి ఈ వార్త గాలి వార్తగానే మిగిలిపోతుందని, వాస్తవాలతో జీవం పోసుకుంటుందా? అన్నది చూడాలి. 

ఇదిలా ఉంటే గత రెండేళ్ళుగా షారూఖ్‌ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. చివరగా నటించిన `జీరో` చిత్రం పరాజయం చెందింది. దీంతో కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇటీవల రాజ్‌ కుమార్‌ హిరానీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు వార్తలు వినిపించాయి. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి