నిర్మాతకి కరోనా.. షాక్‌లో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌..

Published : Aug 07, 2020, 08:45 PM ISTUpdated : Aug 07, 2020, 08:53 PM IST
నిర్మాతకి కరోనా.. షాక్‌లో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌..

సారాంశం

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` నిర్మాత దానయ్యకి కరోనా సోకింది. ఆయనకు మైన్యూర్‌ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేసుకోగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. అంతేకాదు సినిమాపై సస్పెన్స్ నెలకొంది.

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న ఈ మల్టీస్టారర్‌  చిత్రాన్ని దానయ్య డి.వి.వి తన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తాజాగా నిర్మాత దానయ్యకి కరోనా సోకింది. ఆయనకు మైన్యూర్‌ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేసుకోగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. 

ఇదిలా ఉంటే ఇటీవల రాజమౌళి ఫ్యామిలీకి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసింది. ప్రస్తుతం వాళ్ళు ఇంట్లోనే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` నిర్మాతకి వైరస్‌ సోకడం గమనార్హం. అయితే రాజమౌళి కుటుంబం నుంచి దానయ్యకి వైరస్‌ సోకి ఉండొచ్చా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఈ సినిమా రీషూట్‌కి సంబంధించి ప్లాన్‌ చేశారు. మరి ఆ సందర్భంలో వీరి కలిసి ఉండొచ్చని, దాన్నుంచి దానయ్యకి వైరస్‌ సోకి ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు వాస్తవమనేది వారికే తెలియాలి. 

కానీ ప్రస్తుతం అటు దర్శకుడు రాజమౌళికి, ఇటు నిర్మాత దానయ్యకి వైరస్‌ సోకడంతో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌ షాక్‌కి గురవుతుంది. దీని వల్ల ఇప్పుడు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఆందోళన గురవుతున్నట్టు తెలుస్తుంది. మరి వారేమైనా ఇటీవల నిర్మాతగానీ, దర్శకుడినిగానీ కలిశారా? అన్నది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి `ఆర్‌ ఆర్‌ ఆర్‌` నిర్మాత దానయ్య, దర్శకుడు రాజమౌళి వైరస్‌కి గురి కావడం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`పై సస్పెన్స్ నెలకొంటుంది. ముఖ్యంగా `ఆర్‌ ఆర్‌ ఆర్‌` ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదని అర్థమవుతున్న నేపథ్యంలో అభిమానులు మరింత నిరాశకి గురవుతున్నట్టు టాక్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?