సమంత ఓపెనింగ్ కి వెళ్లలేదు, ఇంతకీ సినిమాలో ఉన్నట్లా లేనట్లా?

Published : Jul 11, 2024, 09:07 AM IST
  సమంత ఓపెనింగ్ కి వెళ్లలేదు, ఇంతకీ సినిమాలో ఉన్నట్లా లేనట్లా?

సారాంశం

సమంత  ఎక్కడా కనపడలేదు. దాంతో అసలు ఆమె సినిమా చేస్తోందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. 


సమంత ఈ మధ్యన స్పీడు తగ్గించింది. అనారోగ్య కారణాలతో ఆమె ఆచి,తూచి అడుగులు వేస్తోంది. ఎంపిక చేసిన కథలకే డేట్స్ ఇస్తోంది. ఆమె సినిమాల పరంగా ఫామ్ లో లేకపోయినా  సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో నిత్యం వార్తల్లో ఉంటోంది.  ఆమె తన అభిమానులకు టచ్‌లో ఉంటూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ను ఇన్స్‌టాగ్రామ్ ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె ముమ్మట్టితో ఓ సినిమా కమిటైందని ఆ మద్యన వార్తలు వచ్చాయి. 
 
ఓ రకంగా మళయాళంలోకి ఆమె లాంచింగ్ లాంటి సినిమా అన్నమాట. ఆ సినిమా నిన్నటి రోజు  ప్రారంభం అయింది. ఆ సినిమా ప్రారంభోత్సవానికి ఆ సినిమా దర్శక, నిర్మాత గౌతమ్ మీనన్ తో పాటు పలువురు సెలెబ్రిటీలు విచ్చేశారు. హీరోగా నటిస్తున్న మమ్మూట్టిపై ముహూర్తం సన్నివేశం చిత్రీకరించారు. కానీ సమంత  ఎక్కడా కనపడలేదు. దాంతో అసలు ఆమె సినిమా చేస్తోందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. 

లేక ఆ టైమ్ కు వచ్చి షూటింగ్ కు హాజరవుతుందా అంటున్నారు. ఆమెను గౌతమ్ మీనన్ ఒప్పించాడని చెప్తున్నారు. గౌతమ్ మీనన్ ఆమె కెరీర్ లో పెద్ద సినిమా ఇచ్చారు. ఓ రకంగా కెరీర్ ఇచ్చారని చెప్పారు. ఈ క్రమంలో ఆమె ఈ చిత్రంలో చేస్తోందా లేదా అనే విషయం హాట్  టాపిక్ గా మారింది. ఏ విషయమూ ఇంకా అధికారికంగా బయిటకు రాలేదు. అనారోగ్యంతో  బాధపడుతోందని చెప్పటానికి లేదు. ఎందుకంటే ఆమె వరసపెట్టి చక్కటి   ఫోటోషూట్స్ చేస్తోంది. ట్రావెలింగ్ చేస్తోంది.మెడిటేషన్ క్లాస్ లకు హాజరువుతోంది.  బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

 
మరో ప్రక్క సమంత  రీఎంట్రీ ఏ సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోనే ఆమె కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ తెరకెక్కనుంది. సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని పోస్టర్‌తోపాటు పేరు ప్రకటించారు. అందులో గన్‌ చేతపట్టిన గృహిణిగా కనిపిస్తున్నారు సమంత. ‘‘బంగారం అనిపించుకోవాలంటే ప్రతీదీ మెరిసిపోవల్సిన అవసరం లేదు’’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాని ప్రకటించారు సమంత.

‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాల తర్వాత ఆమె చేస్తున్న సినిమా ఇదే. అనారోగ్యం కారణంగా కొన్ని నెలలపాటు విరామం తీసుకున్న ఆమె, మళ్లీ మునుపటిలా నాజూగ్గా సిద్ధమై కెమెరా ముందుకొస్తున్నారు. పలువురు స్టార్  హీరోల సినిమాల విషయంలో సమంత పేరు వినిపించినా, హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాతోనే ఆమె రీ ఎంట్రీ  చేస్తున్నారు. ‘మా ఇంటి బంగారం’ చిత్ర దర్శకుడు ఎవరు? ఇతరత్రా విషయాలేమిటనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌
Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?