అవి నమ్మద్దు :సందీప్ కిషన్ ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్‌ క్లారిఫికేషన్ నోట్

Published : Jul 11, 2024, 06:38 AM IST
 అవి నమ్మద్దు :సందీప్ కిషన్ ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్‌ క్లారిఫికేషన్ నోట్

సారాంశం

అందులో నిజం లేదని, ఆ ఫొటోలు తమ రెస్టారెంట్ కు చెందినవి కావని క్లారిఫికేషన్ ఇచ్చారు  ‘వివాహ భోజనంబు’ టీమ్. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసారు.

ఓ ప్రక్కన వరస పెట్టి సినిమాలు చేస్తూ మరో ప్రక్క రెస్టారెంట్ బిజినెస్‌లో అడుగుపెట్టారు సందీప్ కిషన్. 'వివాహ భోజనంబు' అనే పేరుతో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఆయన రెస్టారెంట్లు ప్రారంభించారు.  దాదాపు అన్నీ సక్సెస్ సాధించాయి. ఈ రెస్టారెంట్లు తక్కువ కాలంలోనే ఫడ్డీస్ అభిమానాన్ని సంపాదించాయి. ఇక రీసెంట్ గా  హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులపై ఆహార భద్రతా అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్లోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్కడ వారికి కనిపించిన సమస్యలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. . కస్టమర్ల ఆరోగ్యం, భద్రతను నిర్ధారించడానికి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ‘వివాహ భోజనంబు’ నిర్వహకులను అధికారులు ఆదేశించారు. 

అయితే ఈ క్రమంలో ఈ రెస్టారెంట్ లోవే అంటూ చాలా ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఈ రెస్టారెంట్ పరువు తీసే విధంగా ఉన్నాయి. లోపల కిచెన్ చాలా అశుభ్రంగా ఉన్నాయంటూ ఆ ఫొటోలు షేర్ చేస్తున్నారు. అయితే అందులో నిజం లేదని, ఆ ఫొటోలు తమ రెస్టారెంట్ కు చెందినవి కావని క్లారిఫికేషన్ ఇచ్చారు  ‘వివాహ భోజనంబు’ టీమ్. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసారు.

ఇక  ఫుడ్ సేప్టీ అధికారులు రెస్టారెంట్లో బెస్ట్ బిఫోర్ డేట్ (2020) దాటిన చిట్టి ముత్యాలు రైస్ (25 కిలోలు)ను గుర్తించారు. సింథటిక్ కలర్స్‌తో ఉన్న అర కిలో కొబ్బరి తురుమును గుర్తించారు.

  స్టీల్ కంటైనర్‌లలో నిల్వ చేసిన ముడి ఆహార పదార్థాలు & పాక్షికంగా సిద్ధం చేసిన ఆహారాలను కవర్ చేశారు. కానీ వాటిపై లేబుల్ సరిగా లేదు. కొన్ని డస్ట్‌బిన్‌లపై మూతలు లేవు.

 ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు.

 వంటగది ఆవరణలోని కాలువలలో నీరు నిల్వ ఉంది.

  ఆహార తయారీలో ఉపయోగించిన, వినియోగదారులకు అందించే బబుల్ వాటర్ కోసం నీటి విశ్లేషణ నివేదిక అందుబాటులో లేదు.

 ఫుడ్ హ్యాండ్లర్లు హెయిర్‌నెట్‌లు, యూనిఫాం ధరించి కనిపించారు.

 ప్రాంగణంలో పెస్ట్ కంట్రోల్ రికార్డులు అందుబాటులో ఉన్నాయి.

వంట పాత్రలు క్లీన్ చేసిన నీరు అక్కడే నిల్వ ఉండడం చూసి నిర్వాహకులను అడిగారు. భారత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (FSSAI) అధికారులు వివాహ భోజనంబు రెస్టారెంట్‌కు నోటీసులు ఇచ్చారు. వివాహ భోజనంబు రెస్టారెంట్ వివరాలు, అక్కడ ఉపయోగించే ఆహార వివరాలను సోషల్ మీడియా ఎక్స్‌లో జీహెచ్ఎంసీ అధికారులు పోస్ట్ చేశారు.
 

 

PREV
click me!

Recommended Stories

Long Delayed Movies: చిరంజీవి నుంచి నాగ చైతన్య వరకు.. లాంగ్ డిలే వల్ల అడ్రస్ లేకుండా పోయిన 8 సినిమాలు ఇవే
Akhanda 2 Release ఆగిపోవడానికి అసలు కారణం ఇదే ? బాలయ్య నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు?