ఎన్టీఆర్‌ కు జోడీగా ప్రభాస్ హీరోయిన్?

Published : Apr 16, 2019, 11:12 AM ISTUpdated : Apr 16, 2019, 11:13 AM IST
ఎన్టీఆర్‌ కు జోడీగా ప్రభాస్ హీరోయిన్?

సారాంశం

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా గురించిన వార్తల కోసం అభిమానులు వెయిట్ చేస్తూండటంతో రోజుకో వార్త మీడియాలో మొదలవుతోంది. 

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా గురించిన వార్తల కోసం అభిమానులు వెయిట్ చేస్తూండటంతో రోజుకో వార్త మీడియాలో మొదలవుతోంది. తాజాగా  ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా ‘సాహో’హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం మొదలైంది. కుటుంబ కారణాల వల్ల బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ చిత్రలో మరో  హీరోయిన్ ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఆ పాత్రకు బాలీవుడ్‌ హీరోయిన్ అయితే బాగుంటుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో  పరిణీతి చోప్రా అనుకున్నారట. అయితే ఆమె డేట్స్ దొరకటం కష్టంగా ఉందిట. కాగా ఇప్పుడు ఎన్టీఆర్‌కు జోడీగా శ్రద్ధను పరిగణనలోకి తీసుకున్నారట. మరి ఈ వార్తలో  ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే చిత్ర టీమ్ అధికారికంగా ప్రకటించే వరకూ వేచి చూడాల్సిందే.  అలాగే ఈ  సినిమాలోని ఓ పాత్ర కోసం నిత్యా మేనన్‌ను సంప్రదించారని  సైతం వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాకు డైరక్షన్ చేస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌ చరణ్‌, కొమరం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాను దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.  ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?