నాదేం దొంగపెళ్లి కాదు.. రేణుదేశాయ్ కామెంట్స్!

By Udaya DFirst Published Apr 16, 2019, 10:45 AM IST
Highlights

నటి రేణుదేశాయ్.. పవన్ కి విడాకులిచ్చిన తరువాత మరో పెళ్లికి రెడీ అయింది. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

నటి రేణుదేశాయ్.. పవన్ కి విడాకులిచ్చిన తరువాత మరో పెళ్లికి రెడీ అయింది. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆమెకి ఎంగేజ్మెంట్ జరిగిన సమయంలో ఎంత హడావిడి చేశారో తెలిసిందే.

పవన్ మరో పెళ్లి చేసుకున్నప్పటికీ రేణు మాత్రం ఇంకొకరిని చేసుకోకూడదనే పిచ్చి వాదనతో ఆమెను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయాలపై స్పందించింది రేణుదేశాయ్. తనకు ఎంగేజ్మెంట్ అయిపోయిందని.. ఎక్కువ వివరాలు ఇవ్వను కానీ అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటానని.. ఎందుకంటే తనది దొంగపెళ్లి కాదని.. కుటుంబంలో అందరి ఆమోదంతో జరుగుతుందని స్పష్టం చేసింది.

తనకు ఎంగేజ్మెంట్ జరిగి చాలా కాలమవుతున్నా.. ఇంకా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎంగేజ్మెంట్ జరిగి ఇన్నాళ్ళైనా ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదనే విషయంపై కూడా చర్చలు ఎక్కువయ్యాయని చెప్పుకొచ్చింది.

తన పెళ్లి గురించి తనకు తప్ప అందరికీ హడావిడి ఎక్కువైపోయిందని కౌంటర్ ఇచ్చింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని, పెళ్లి అంటే చాలా ప్రాసెస్ ఉంటుందని.. దానికి కాస్త సమయం పడుతుందని చెప్పింది. తనకు కాబోయే భర్త పూణేలో ఓ ఐటీ కంపనీలో డైరెక్టర్ స్థాయిలో పని చేస్తున్నట్లు వెల్లడించింది. 

click me!