ఇలియానాపై ఆ పుకార్లు నిజమేనా..?

Published : Apr 16, 2019, 11:02 AM IST
ఇలియానాపై ఆ పుకార్లు నిజమేనా..?

సారాంశం

నటి ఇలియానా గర్భవతి అంటూ చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు. 

నటి ఇలియానా గర్భవతి అంటూ చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఈ వార్తలు పుకార్లు కావని ఇలియానా నిజంగానే ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది.

దానికి లాజిక్కులు కూడా తీస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ లో ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తుంది. జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలై రెండు నెలలు కావొస్తుంది. అయితే సడెన్ గా ఇలియానా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు సమాచారం.

దానికి ఆమె గర్భవతి కావడమేనని వార్తలు ప్రచురిస్తున్నారు. చాలాకాలంగా ఇలియానా ఓ ఫారెన్ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఈ జంటగా సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని టాక్. ప్రస్తుతం ముంబైలో వీరిద్దరూ కలిసే జీవిస్తున్నారు.

ఈ క్రమంలో ఆమె గర్భవతి అనే వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సౌత్ లో రెండు సినిమాల ఆఫర్స్ వస్తే వాటిని కూడా పక్కన పెట్టేసింది. దానికి కూడా కారణం ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రాస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?