గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చిందనే చెప్పొచ్చు.ఈ సినిమా సక్సెస్‌తో రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఖిలాడి’ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.
మాస్ మహరాజా రవితేజ ఈ ఏడాది 'క్రాక్' మూవీ హిట్ తో జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. దాంతో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటు వెళ్తున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ తెరచుకోవడంతో.. సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా? అనే సందేహాలకు పటాపంచలు చేస్తూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అదరగొట్టడం రవితేజ స్టామినాని తెలియచేసింది. ఇక రవితేజ ప్రధానపాత్రలో రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్యన రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి చెందిన గ్లింప్స్ విడుదల చేస్తే మంచి రెస్పన్స్ వచ్చింది.
'ఖిలాడి' పేరుతోనే మరరోసారి రవితేజ..తనదైన మాస్ యాక్షన్ ఎంటర్టేనర్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడని అర్దమైంది. . ఈసైకో థ్రిల్లర్ల్‌ని అంతే గ్రిప్పింగ్‌గా రీమేక్ చేసిన దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. ఖిలాడీ చిత్రంలో మరోసారి రవితేజ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నట్టు సమాచారం. రవితేజ నటిస్తోన్న 67వ సినిమా. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అభిమానులంతా ఈ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మధ్యన ఈ చిత్రానికి సంభదించిన అప్డేట్స్ ఆగిపోయాయి. అందుకు కారణం ఏమిటనేది మీడియాలో చర్చగా మారింది.
ఇండస్ట్రీలో చెప్పుకునేదాని ప్రకారం ఈ సినిమా బడ్జెట్ చాలా పెరిగిపోయిందట. అనుకున్న బడ్జెట్ కీ, ఇప్పటికి అయిన ఖర్చుల లెక్కలకూ అస్సలు పొంతన లేకుండా పోయిందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ మరో పది రోజులు బాకీ ఉందని, బడ్జెట్ లేక షూటింగ్ ఆగిపోయిందని, ఫైనాన్షియర్లు ముందుకొస్తే తప్ప ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలవ్వదని చెప్పుకుంటున్నారు.
మరో ప్రక్క ఖిలాడీ ఫారెన్ షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేశారు. అయితే కరోనా కారణంగా ఆ షెడ్యూల్ ని అర్థాంతరంగా ముగించుకుని రావాల్సివచ్చింది. కరోనా వల్ల మిగిలిన సినిమాలు కూడా నష్టపోయాయి. కానీ ఖిలాడీ కాస్త ఎక్కువ నష్టపోయిందని, అందుకే ఇంత ఇబ్బందని ఇన్ సైడ్ వర్గాలు అంటున్నాయి. దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ఖిలాడి. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కట్టాడు.