రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీ... కర్త కర్మ క్రియ ఎన్టీఆర్?

By Sambi ReddyFirst Published Nov 28, 2022, 1:32 PM IST
Highlights


రామ్ చరణ్ తో బుచ్చిబాబు... ఇది ఊహించని కాంబినేషన్. ఈ అనూహ్య పరిణామం వెనుక ఎన్టీఆర్ హస్తం ఉందనేది తాజా వార్త. ఆయన సలహా మేరకే బుచ్చిబాబు ప్రాజెక్ట్ కి రామ్ చరణ్ సైన్ చేశారట. 


వెయిట్ చేస్తే చేశాడు కానీ ఉప్పెన బుచ్చిబాబు జాక్ పాట్ కొట్టేశారు. స్టార్ హీరో రామ్ చరణ్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించేశాడు.  బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ చేస్తున్నట్లు నేడు మేకర్స్ ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రకటన టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. 

2021లో విడుదలైన ఉప్పెన టాలీవుడ్ అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పావలా పెట్టుబడికి రూపాయి లాభాలు తెచ్చిపెట్టింది. ఓ వినూత్న కాన్సెప్ట్ తో ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా ఉప్పెన తెరకెక్కింది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్స్ గా పరిచయమైన ఈ మూవీలో విజయ్ సేతుపతి కీలక రోల్ చేశారు. ఇక దేవిశ్రీ సాంగ్స్ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఉప్పెన సక్సెస్ బుచ్చిబాబుకు ఆఫర్స్ తెచ్చిపెట్టింది. అయితే ఆయన ఎన్టీఆర్ పై కన్నేశాడు. 

Sometimes, Revolt becomes a necessity ❤️‍🔥

Mega Power Star & Sensational director team up for a powerful subject and a Pan India entertainer 💥 🔥

Produced by &

Presented by pic.twitter.com/zdZxguAX2g

— Vriddhi Cinemas (@vriddhicinemas)

ఎన్టీఆర్ కోసం ఓ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా సిద్ధం చేశారు.  ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి నెరేట్ చేశాడు. ఎన్టీఆర్ స్టోరీ లైన్, స్క్రిప్ట్ పట్ల ఆసక్తి చూపించాడు. ఇంకా మెరుగులు దిద్దు, మూవీ చేద్దామని హామీ ఇచ్చాడు. దీంతో బుచ్చిబాబు-ఎన్టీఆర్ కాంబోలో మూవీ ఉందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. టైటిల్ పెద్ది అనుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను బుచ్చిబాబు ఖండించలేదు. దీంతో ప్రాజెక్టు ఖాయం అనుకున్నారు. 

అయితే ఎన్టీఆర్ లైనప్ రీత్యా మరో రెండేళ్లు వేరే దర్శకుడితో మూవీ చేసే ఛాన్స్ లేదు. కొరటాల శివతో మూవీ పూర్తి కాగానే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయాల్సి ఉంది. దీంతో బుచ్చిబాబును వెయిట్ చేయించడం కరెక్ట్ కాదని ఎన్టీఆర్ నమ్మాడు. రామ్ చరణ్ కి బుచ్చిబాబుతో మూవీ చేయాలని సూచించాడు. స్క్రిప్ట్ బాగుంది, నీకు కూడా బాగా సెట్ అవుతుంది. విని నచ్చితే మూవీ చేయమని సలహా ఇచ్చాడు. 

సహజంగానే మంచి మిత్రులైన రామ్ చరణ్-ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఎక్కువ సమయం కలిసి ఉంటున్నారు. ఎన్టీఆర్ గురించి పూర్తిగా తెలిసిన రామ్ చరణ్... ఆయన సలహా సీరియస్ గా తీసుకున్నారు. బుచ్చిబాబు స్క్రిప్ట్ వినడం, మూవీ ఓకే చేయడం జరిగిందనేది టాలీవుడ్ లో  ప్రముఖంగా వినిపిస్తోంది. కాబట్టి ఇది ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు రాసుకున్న కథే అంటున్నారు. మొత్తంగా బుచ్చిబాబుకు ఎన్టీఆర్ జీవితంలో మర్చిపోలేని సహాయం చేశాడు, అంటున్నారు. 
 

click me!