శీతాకాలంలోనే ‘గుర్తుందా శీతాకాలం’.. తమన్నా - సత్యదేవ్ మూవీ రిలీజ్ డేట్ ఇదే!

Published : Nov 28, 2022, 12:54 PM IST
శీతాకాలంలోనే ‘గుర్తుందా శీతాకాలం’.. తమన్నా - సత్యదేవ్ మూవీ రిలీజ్ డేట్ ఇదే!

సారాంశం

టాలెంటెడ్ హీరో సత్యదేవ్, మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ఆలస్య అవుతూ వస్తున్న ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.   

విభిన్న కథలను ఎంచుకుంటూ నటుడు సత్యదేవ్ (Satyadev) ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూన్నారు. ఇప్పటికే టాలీవుడ్ ను ఊపూపిన స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించింది. వీర ఇద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ (Gurtunda Seetakalam). 2020లోనే ప్రారంభం అయిన ఈ చిత్రం.. కరోనా పరిస్థితులు.. తదితర కారణాలతో ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తున్నారు. 

తాజాగా చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది జూన్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘గుర్తుందా శీతాకాలం’ ఏట్టకేళలకు డేట్ ను లాక్ చేసుకుంది.  డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూడు కాలాల లాగే సినిమాలోనూ మూడు బ్యూటీఫుల్ లవ్ స్టోరీలను చూపించబోతున్నారు. సత్యదేవ్ లోని రొమాంటిక్ యాంగిల్ ను పరిచయం చేయనున్న ఈ చిత్రం.. శీతాకాలంతో హీరో జీవితానికి ముడిపడి ఉన్న బంధం ఏమిటో తెలియజేయనుంది. ఇలాంటి సబ్జెక్ట్ తో శీతాకాలంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆసక్తికరంగా మారింది. 

టాలెంటెడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సత్యదేవ్, తమన్నా జంటగా  న‌టించిన  'గుర్తుందా శీతాకాలం’ చిత్రానికి క‌న్న‌డ‌లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు, న‌టుడు నాగ‌శేఖ‌ర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్ష‌ర ఫిల్మ్స్ , నాగ‌శేఖ‌ర్ మూవీస్ మరియు మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై నిర్మాత‌లు చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిన‌బాబు, ఎం, సుబ్బారెడ్ది లు స‌మ‌ర్పిస్తున్నారు. కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు. 

కెరీర్ లో మొదటిసారి సత్యదేవ్ రొమాంటిక్ పాత్రలో కనిపించబోతున్నారు. తమన్నా(Tamannaah), మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దర్శకుడు నాగ శేఖర్ బ్యూటీపుల్ గా తెరకెక్కిస్తున్నారు.. ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరోవైపు సత్యదేవ్ ‘తిమ్మరుసు’,‘క్రిష్ణమ్మ’ లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ‘గాడ్ ఫాదర్’,‘రామ్ సేతు’ చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?