‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 2022 సమ్మర్‌కి పోస్ట్ పోన్‌..? మరో షాక్‌ ఇవ్వబోతున్న రాజమౌళి

Surya Prakash   | Asianet News
Published : Aug 20, 2021, 09:15 AM IST
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 2022 సమ్మర్‌కి పోస్ట్ పోన్‌..? మరో షాక్‌ ఇవ్వబోతున్న రాజమౌళి

సారాంశం

 ఈ సినిమా మరోసారి వాయిదా పడక తప్పేలా లేదని ఇండస్ట్రీవర్గాలు అంటున్నాయి. దీంతో ఈ సినిమా బహుశా సమ్మర్‌ను టార్గెట్‌గా చేసుకుని 2022లో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

కరోనా ప్రభావం సినీ  పరిశ్రమపై బాగా ఉంది. ముఖ్యంగా పెద్ద సినిమాల రిలీజ్ పరిస్దితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రకటించిన రిలీజ్ డేట్స్ కు రిలీజ్ కాలేని పరిస్దితి నెలకొంది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలపై ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఇలాంటి సినిమాలు దేశం మొత్తం రిలీజ్ అయితేనే ఫలితం ఉంటుంది. రికవరీ ఉంటుంది. అయితే ఒక్కో స్టేట్ లో కరోనా తో రిలీజ్ ల పరిస్దితి ఒక్కోలా ఉంది. ప్రస్తుతానికి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే నార్త్ సైడ్ ఇంకా సెట్ కాలేదు. 

ఈ నేపధ్యంలో ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ పరిస్దితి ఏమిటనేది అర్దం కావటం లేదు.  ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన  ఆర్ ఆర్ ఆర్ ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కాబోతున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే అదీ సాధ్యమయ్యే పరిస్దితి కనపడటం లేదు. నార్త్ లో  మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాల్లో థియేటర్లు ఇంకా క్లోజ్ అయ్యే ఉన్నాయి. దాంతో అన్ని భాషల్లో సినిమాని రిలీజ్ చేయడం అంటే సాధ్యం కాని పని. అలాగని తెలుగు మాత్రమే రిలీజ్ చేసి ఊరుకుంటే రికవరీ అవ్వదు. దాంతో సమ్మర్ 2022 కు సినిమాని ఫోస్ట్  ఫోన్ చేసే అవకాసం ఉన్నట్లు సమాచారం. 
 
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్ ప్రధాన పాత్రధారులుగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది.  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ‘బాహుబలి’ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
 
ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. వీళ్లిద్దరి గురువు పాత్రను అజయ్‌ పోషిస్తున్నారని సమాచారం. ఆయన పాత్ర చాలా శక్తిమంతంగా.. ఉండనుందని చిత్ర బృందం ప్రకటించింది. 

 ఈ సారి ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ వెర్షన్ సైతం డబ్ చేసి ఆర్ ఆర్ ఆర్ ని విడుదల చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని సమాచారం. అమెరికా, యూరప్ కంట్రీలలో ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం హాలీవుడ్ లో క్రేజ్ పుట్టించటం కోసం హాలీవుడ్ పీఆర్ ఏజెన్సీలతో ప్రమోషన్ చేయనున్నట్లు వినికిడి. వాళ్లు ఈ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లేందుకు సాయిం చేస్తారు. అప్పుడు బాలీవుడ్ లో మాత్రమే కాక ...హాలీవుడ్ లోనూ ఈ సినిమా గురించి మాట్లాడతారు. ఖచ్చితంగా అక్కడవారితో బిజనెస్ చేసే అవకాసం ఉంటుంది. రాజమౌళి ఈ సారి తన సినిమాతో నెక్ట్స్ లెవిల్ చూడాలనుకుంటున్నారు.
 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి