ఆంధ్రా వంటకాలతో సైఫ్ అలీ ఖాన్ ని థ్రిల్ చేసిన ప్రభాస్

pratap reddy   | Asianet News
Published : Aug 19, 2021, 06:36 PM IST
ఆంధ్రా వంటకాలతో సైఫ్ అలీ ఖాన్ ని థ్రిల్ చేసిన ప్రభాస్

సారాంశం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సూపర్ బిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటిస్తున్నాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సూపర్ బిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని ప్రాజెక్ట్ కె కూడా ప్రారంభం అయింది. 

ఈ చిత్రాలతో పాటు ప్రభాస్ బాలీవుడ్ మూవీ 'ఆదిపురుష్' కూడా స్టార్ట్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న మూవీసే. ఇదిలా ఉండగా ఆదిపురుష్ షూటింగ్  బుధవారం ముంబైలో ప్రారంభం అయింది. తొలి షెడ్యూల్ లో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ పాల్గొననున్నారు. 

తొలిరోజే ప్రభాస్.. సైఫ్ అలీఖాన్ మరికొందరు చిత్ర యూనిట్ సభ్యులని థ్రిల్ చేశాడు. ప్రభాస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆంధ్రా వంటకాలు. ప్రభాస్ ఆంధ్రా వంటకాల్ని అమితంగా ఇష్టపడతాడు. అంతే కాదు కొత్తవారికి కూడా ఆంధ్ర వంటకాలతో విందు ఇస్తుంటాడు. 

ఆదిపురుష్ సెట్స్ లో సైఫ్ అలీ ఖాన్ కు ప్రభాస్ వివిధ ఆంధ్ర వంటకాలతో విందు ఏర్పాటు చేశాడట. ప్రభాస్ ఇచ్చిన విందుకు సైఫ్ అలీఖాన్ థ్రిల్ కి గురయ్యాడట. ఆంధ్రవంటకాల రుచులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ వంటకాల విందు సైఫ్ అలీ ఖాన్ ద్వారా బిటౌన్ మొత్తం వ్యాపించిందట. ఆదిపురుష్ లో సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఓం రౌత్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Kamal Haasan: 40 ఏళ్లుగా స్నేహం, కానీ మెగాస్టార్ విషయంలో కమల్ హాసన్ బాధ ఇదొక్కటే
Gunasekhar: ప్లాప్ ఇస్తే ఫోన్ కూడా ఎత్తరు.. వరుడు తర్వాత బన్నీ.. గుణశేఖర్ ఓపెన్ కామెంట్స్