'రెడ్డి గారి అబ్బాయి'గా మహేష్ బాబు..?

Published : May 18, 2019, 01:31 PM IST
'రెడ్డి గారి అబ్బాయి'గా మహేష్ బాబు..?

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మంచి సందేశాత్మక చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మహేష్ ఇప్పుడు పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంతో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

'ఎఫ్ 2' చిత్రంతో సక్సెస్ అందుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం మహేష్ టూర్ లో ఉన్నాడు. ఆయన తిరిగి రాగానే షూటింగ్ మొదలుపెడతారు. అయితే ఈ సినిమాకు టైటిల్ గా 'సరిలేరు నీకెవ్వరూ' అనే పేరు పెడుతున్నట్లు వార్తలు వినిపించాయి.

తాజాగా తెరపై మరో టైటిల్ వచ్చింది. అదేంటంటే.. 'రెడ్డి గారి అబ్బాయి'. ఈ సినిమాకి రాయలసీమ టచ్ ఉంటుందని.. ఆ కారణంగానే ఈ టైటిల్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చిత్రయూనిట్ మాత్రం ఇది కేవలం వర్కింగ్ టైటిల్ అని నిజమైన టైటిల్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెబుతోంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక, సాయి పల్లవి లాంటి హీరోయిన్లను అనుకుంటున్నారు కానీ ఎవరినీ ఫైనల్ చేయలేదు. 

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..