#Gunturkaaram ట్రైలర్‌ అందుకే లేటైందా?, మహేష్ సలహాతో ఆ మార్పులు?

By Surya PrakashFirst Published Jan 8, 2024, 11:39 AM IST
Highlights

అంతటా వైరల్ గా మారిన  ఈ ట్రైలర్ గురించిన ఓ వార్త బయిటకు వచ్చింది. ఈ ట్రైలర్ ని మొదటగా చూసిన మహేష్ బాబు మార్చి మాడిఫైచేసి కట్ చేయించారనేది వార్త.
 

 మహేశ్‌బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్‌ (Trivikram) హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించిన కబుర్లే. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా ..హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ  నిర్మిస్తున్నారు. జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్  తాజాగా ట్రైలర్‌ విడుదల చేసింది. మాస్‌ అవతార్‌లో మహేశ్‌ లుక్‌, త్రివిక్రమ్‌ మార్క్‌ పంచ్‌ డైలాగ్స్‌ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. అయితే ఈ ట్రైలర్ గురించిన ఓ వార్త బయిటకు వచ్చింది. ఈ ట్రైలర్ ని మొదటగా చూసిన మహేష్ బాబు మార్చి మాడిఫైచేసి కట్ చేయించారనేది వార్త.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...ఈ సినిమాకు ఓ ట్రైలర్ కట్ చేసారు. ఆ ట్రైలర్ లో మరిన్ని ఎమోషనల్ మూమెంట్స్,సర్పైజ్ లు ఉన్నాయి. అయితే మహేష్ బాబు ఏ సర్పైజ్ లు రివీల్ చేయద్దని, ఎమోషన్ కంటెంట్ ని హైలెట్ చేయద్దని, థియేటర్ దాకా దాచి పెట్టమని చెప్పారట. దాంతో ఆ ట్రైలర్ ని ప్రక్కన పెట్టి మరో ట్రైలర్ ని కట్ చేసారట. అందుకే ట్రైలర్ రిలీజ్ లేట్ అయ్యిందని వినికిడి.అలాగే సౌండ్ మిక్సింగ్ ప్లాబ్లంలు చూసుకోకండా వదలటంతో టీవీల్లో ఈ ట్రైలర్ ఆడియో సరిగ్గా వినపడలేదు. ఫోన్స్ లో ఈ ట్రైలర్ బాగానే వినిపించింది. 

Latest Videos

 “మీరు మీ పెద్దబ్బాయిని.. అనాథలాగా వదిలేశారని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు” అని రమ్యకృష్ణను ఓ రిపోర్టర్ అడగడంతో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత మహేశ్ బాబు ఎంట్రీ ఉంది. గుంటూరు మిర్చీల మధ్య బీడీ తాగుతూ మాస్ లుక్‍తో రెడ్ కలర్ జీప్ నుంచి మహేశ్ దిగే షాట్ అదిరిపోయింది. “చూడంగానే మజా వచ్చిందా.. హార్ట్ బీట్ పెరిగిందా.. ఈల వేయాలనిపించిందా” అంటూ డైలాగ్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సుల్లో మాస్ మార్క్ కనిపించింది. ఈ చిత్రంలో రమణ క్యారెక్టర్ చేశారు మహేశ్. రౌడీ రమణ అంటూ రావు రమేశ్ డైలాగ్ ఉంది.
 
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో ‘అతడు’ ‘ఖలేజా’ వంటి క్రేజీ సినిమాల తర్వాత ఇంకో సినిమా వస్తుంది అంటే సహజంగానే అంచనాలు భారీగా ఏర్పడతాయి. ‘గుంటూరు కారం’ పై కూడా అదే విధంగా అంచనాలు ఏర్పడ్డాయి. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జనవరి 12 న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ‘గుంటూరు కారం’ గ్లింప్స్, ‘దమ్ మసాలా’ ‘ఓ మై బేబీ’ ‘కుర్చీని మడతపెట్టి’ వంటి పాటలు అంచనాలను మ్యాచ్ చేయలేకపోయాయి అనే చెప్పాలి.మాస్ గా అనిపించినా ‘కుర్చీని మడతపెట్టి’ జనాల్లోకి బాగా వెళ్లింది.
 

click me!