యాక్షన్ షెడ్యుల్ కు రెడీ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ ఆయుధాలు ప్రదర్శించిన హరీష్ శంకర్

Published : Sep 05, 2023, 12:20 PM ISTUpdated : Sep 05, 2023, 12:22 PM IST
యాక్షన్ షెడ్యుల్ కు రెడీ అవుతున్న ఉస్తాద్  భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ ఆయుధాలు ప్రదర్శించిన హరీష్ శంకర్

సారాంశం

చాలా కాలం వెయిటింగ్ తరువాత ఉస్తాద్ సినిమాకు మోక్షం లభించింది. ఇక సినిమా షూటింగ్ షెడ్యూల్ ను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇక పవర్స్ స్టార్ కు సబంధించి ఓయాక్షన్ అప్ డేట్ ను అందించాడు హరీష్ శంకర్. విషయం ఏంటంటే..?   

 
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా.. యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న సినిమా  ఉస్తాద్‌ భగత్‌ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్  డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ... భారీ సినిమాల నిర్మించే..  మైత్రీ మూవీ మేకర్స్  సంస్థ తెర‌కెక్కిస్తుంది.ఇక ఈమూవీకి పవర్ స్టార్ నుంచి  డేట్స్ దొరక్క.. ,చాలా కాలంగా షూటింగ్ పెండింగ్ పడుతూ వచ్చింది. ఎలాగో కొన్ని షెడ్యూల్స్ ను కంప్లీట్ చేశాడు హరీష్ శంకర్. అంతే కాదు పవర్ స్టార్ కాంబినేషన్ సీన్స్ కు సంబంధించిన ఎక్స్ పెర్షన్స్ తో పాటు.. కొన్ని సీన్స్ ను కంప్లీట్ చేశాడు. 

ఇక ఇప్ప‌టికే కొన్ని షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఉస్తాద్‌భ‌గ‌త్ సింగ్ గురించి కొత్త న్యూస్ అందించాడు డైరెక్టర్ హరీష్ శంక‌ర్.ఈ మూవీభారీ యాక్ష‌న్ షెడ్యూల్ షూటింగ్ కు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ షూటింగ్ ఈరెండు రోజుల్లో స్టార్ట్ అవ్వబోతున్నట్టు సమాచారం.  రేప‌టి నుంచి షురూ కానుంది..అంటూ ట్వీట్ చేశాడు డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌. ఇందులో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చాలా ప‌దునైన ఆయుధాల‌ను వినియోగించ‌బోతున్న‌ట్టు తెలియ‌జేశాడు. పవర్ స్టార్ ఈసినిమా కోసం వాడిని ఆయుధాలను సరదాగా ప్రదర్శనకు పెట్టాడు దర్శకుడు. 

 

ఇక ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్ గ్లింప్స్ ఇప్ప‌టికే నెట్టింట‌ ట్రెండింగ్ అవుతూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.భగత్‌.. భగత్‌ సింగ్‌ మహంకాళి పోలీస్‌స్టేషన్‌, పత్తర్‌ గంజ్‌, ఓల్డ్‌ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్‌ కల్యాణ్ డైలాగ్స్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్‌ బజ్‌ క్రియేట్ చేస్తున్నాయి. గబ్బర్‌ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా.. స్టార్ కాస్ట్ ఇందులో సందడి చేయబోతున్నారు. గతంలో  వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఎన్ని కార్డ్స్ బ్రేక్ చేసిందో తెలిసిందే..? 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 17 అమూల్య నిశ్చితార్థం ఆపేందుకు భారీ ప్లాన్ వేసి శ్రీవల్లి, భాగ్యం.. కానీ
Thanuja: సీరియల్స్ కి తనూజ గుడ్‌ బై.. ఇకపై ఆమె టార్గెట్‌ ఇదే.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 కి వెళ్లిన కారణం ఇదేనా