సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ28‘. షూటింగ్ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని ప్రకటించగా.. తాజాగా మరో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సినిమా కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తుంటారో తెలిసిందే. చివరిగా ‘సర్కారు వారి పాట’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో.. నెక్ట్స్ సినిమాలపై మరింతగా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మహేశ్ బాబు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇఫ్పటికే షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో కాస్తా ఆలస్యంగా స్టార్ట్ అయ్యింది.
ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) నటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో పాటు మరో యంగ్ హీరోయిన్ శ్రీలీలా కూడా నటిస్తుందని ఇప్పటికే నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. సినిమాలో హీరోయిన్ అంటే.. హీరోయినే.. సెకండ్.. ఫస్ట్ హీరోయిన్ అంటూ ఉండరని ఆసక్తిగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తోంది. బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) కూడా మహేశ్ సినిమాలో నటించబోతుందని తెలుస్తోంది.
పదేండ్ల తర్వాత మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తుండటం.. అందులోనూ ఇలా క్రేజీ అప్డేట్స్ అందుతుండటం ఆసక్తిని పెంచుతోంది. అయితే బాలీవుడ్ లో అందాలు ఆరబోస్తున్న భూమి పెడ్నేకర్ ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో చూడాలి. అయితే ఇంకా ఈ హీరోయిన్ పై క్లారిటీ రాలేదు. ఎస్ఎస్ఎంబీ28లోని ఓ కానిస్టేబుల్ పాత్ర కోసం ఈ హీరోయిన్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతేడాది వరుసగా ‘బదాయి దో.. రక్షా బంధన్, గోవింద నామ్ మేరా’ వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ బ్యూటీ బిజీ షెడ్యూల్ ను కలిగి ఉంది.
ఈ చిత్రంలో మహేశ్ బాబు న్యూ లుక్ లో దర్శనమివ్వబోతున్నారు. ఇప్పటికే హెయిర్ స్టైల్, రగ్డ్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ ఉంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆగస్టు 11న చిత్రాన్ని విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు. ఇప్పటికే చిత్రం రెండు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.