
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఘనంగా మొదలైన Indian Premier League (ఐపీఎల్) 2023 ఓపెనింగ్ వేడుకల్లో టాలీవుడ్ హీరోయిన్లు సందడి చేశారు. వరుస ఆఫర్లను అందుకుంటూ బాలీవుడ్ ను షేక్ చేస్తున్న మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) , నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) తమ డాన్స్ లతో అదరగొట్టారు. ఈ ముద్దుగుమ్మల పెర్ఫామెన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు.
మిల్క్ బ్యూటీ తమన్నా లైవ్ డాన్స్ పెర్ఫామెన్స్ తో ఫ్యాన్స్ ను, క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. పలు హిందీ సాంగ్స్ తో పాటు తెలుగు సెన్సేషనల్ సాంగ్ సమంత నటించిన ‘ఊ అంటావా మావా’ సాంగ్ కు గ్లామర్ స్టెప్పులేసి ఉర్రూతలూగించింది. అలాగే రష్మిక మందన్న కూడా తన డాన్స్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. పుష్ప చిత్రంలోని శ్రీవల్లి, రారా సామీ పాటలకు స్టెప్పులేసి ఆకట్టుకుంది.
అలాగే రీసెంట్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ Naatu Naatu సాంగ్ కు నేషనల్ క్రష్ డాన్స్ చేసింది. భారతీయులను గర్వించేలా చేసిన ఈ సాంగ్ ప్రారంభం కాగానే స్టేడియం మొత్తం అభిమానుల అరుపులతో దద్దరిల్లింది. ఇక రష్మిక కూడా హుక్ స్టె్ప్ తో అదరగొట్టింది. మొత్తానికి ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో ఈ ముద్దుగుమ్మలు తమ డాన్స్ తో హోరెత్తించారు.
ప్రస్తుతం మిల్క్ బ్యూటీ తమన్నా మెగాస్టార్ చిరు సరసన ‘భోళా శంకర్’లో నటిస్తోంది. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రజినీకాంత్ సరసన కూడా జైలర్ లో నటిస్తోంది. ఇక రష్మిక మందన్న అటు హిందీలో ‘యానిమల్’ చిత్రంలో, ఇటు ‘పుష్ప : ది రూల్’లో నటిస్తోంది. రీసెంట్ గా నితిన్ తోనూ సినిమాను ప్రకటించింది. ఇక నేటి మ్యాచ్‌తో మొదలయ్యే ఐపీఎల్ 2023 సీజన్, మే 28 వరకూ కొనసాగనుంది.