
ఒకప్పుడు థియేటర్ రెవిన్యూని లెక్కేస్తూ ఏ సినిమా ఎక్కువ మంది ఆదరించారు..ఏ సినిమా జనాలకు బాగా నచ్చింది. ఏ సినిమా మరో సినిమాతో పోటీ పడుతోంది వంటి విషయాలు లెక్కేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇది ఓటిటిల యుగం. ఓటిటి సినిమా వ్యూస్ మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన రెండు సినిమాలు వ్యూస్ విషయంలో పోటా పోటీగా ఉన్నాయి. అవేమిటంటే... మళయాళంలో వచ్చిన ‘అన్వేషిప్పిన్ కండెతుమ్’, హిందీలో వచ్చిన ‘మెర్రీ క్రిస్మస్’.
అన్వేషిప్పిన్ కండెతుమ్
- నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మళయాళ స్టార్ టొవినో థామస్ నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అన్వేషిప్పిన్ కండెతుమ్ కూడా శుక్రవారం (మార్చి 8) నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లోనూ ఓటీటీలో రిలీజ్ అవ్వటంతో నెట్‌ఫ్లిక్స్ లో రికార్డులు బ్రేక్ అయ్యే అవుతున్నాయి. ‘కన్నూర్ స్క్వాడ్’లా ఇది కూడా ఓ పోలీసు టీమ్ కథ. ఓ కేసుని ఇన్విస్టిగేట్ చేసేటప్పుడు ఎదరయ్యే సమస్యలతో నిర్మించారు.
మెర్రీ క్రిస్మస్ - నెట్‌ఫ్లిక్స్ (మార్చి 8)
మరో ప్రక్క శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ కలిసి నటించిన మరో థ్రిల్లర్ మూవీ మెర్రీ క్రిస్మస్. హిందీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా సినిమాకు మొదట్లో మంచి రివ్యూలే వచ్చాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు రూ.60 కోట్లకు ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన నాలుగు, ఐదు వారాల తర్వాత ఓటీటీ రిలీజ్ అయ్యేలా ఒప్పందం జరిగింది . ఆ ప్రకారమే ఫిబ్రవరి8 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతోపాటు.. ఇటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ మూవీని విడుదల చేసారు. దర్శకుడు ఈ ఇద్దరి పాత్రలను ప్రధానంగా చేసుకునే ఈ కథను నడిపించాడు. ఆ తరువాత మరో నాలుగైదు పాత్రలు కాస్త ముఖ్యమైనవిగా కనిపిస్తాయంతే. ఎక్కడా ఎలాంటి కమర్షియల్ హంగులు మనకి కనిపించవు. క్రిస్మస్ పండుగ రోజున .. ఒక రాత్రిలో జరిగే సంఘటనల సమాహారమే ఈ కథ. ఒక ఫ్రెంచి కథకి దృశ్యరూపాన్ని ఇచ్చిన సినిమా ఇది.