ఆగిపోయిన కారు తోసుకుంటూ పోయిన పవన్ కళ్యాణ్ డైరెక్టర్.. వీడియో వైరల్!

By Sambi ReddyFirst Published Mar 14, 2024, 10:52 AM IST
Highlights

దర్శకుడు హరీష్ శంకర్ రోడ్డుపై నిలిచిపోయిన కారు తోసుకుంటూ పోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగిందో పరిశీలిస్తే.. 
 

దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో బిజీ. హీరో పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ డిలే అయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా ఉన్నారు. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఎన్నికల అనంతరం పట్టాలెక్కనుంది. అయితే ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ హీరో రవితేజతో మూవీ కమిట్ అయ్యారు. మిస్టర్ బచ్చన్ టైటిల్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. 

మిస్టర్ బచ్చన్ ఆల్రెడీ పట్టాలెక్కింది. షూటింగ్ జరుపుకుంటుంది. మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, టీ సిరీస్ నిర్మిస్తున్నాయి. మిస్టర్ బచ్చన్ టైటిల్ ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గత చిత్రం మిరపకాయ్ సూపర్ హిట్. దాంతో మిస్టర్ బచ్చన్ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కాగా దర్శకుడు హరీష్ శంకర్ రోడ్డుపై కారును తోస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు వ్యక్తులతో కలిసి హరీష్ శంకర్ ర్ రోడ్డుపై ఆగిపోయిన కారును నెడుతున్నారు. హరీష్ శంకర్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ లో ఒకరైన రవి శంకర్ కూడా ఉన్నారు. హరీష్ శంకర్ కారు ఆగిపోయిందా? అందుకే ఆయన తోచుకుంటూ వెళుతున్నారా? అనే సందేహాలు నెటిజెన్స్ వ్యక్తం చేశారు. 

అయితే అది వేరొకరి కారు అని సమాచారం. బ్రేక్ డౌన్ కావడంతో రోడ్డు మధ్యలో ఆగిపోయింది. దాంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. అక్కడే ఉన్న హరీష్ శంకర్, రవిశంకర్ స్థానికుల సహాయంతో ఆగిపోయిన కారును రోడ్డు పక్కకు నెట్టారు. అదన్నమాట సంగతి. ఈ విషయం తెలిసిన నెటిజెన్స్ హరీష్ శంకర్, రవి శంకర్ లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ స్థాయి మరచి మరొకరికి ఇలా సహాయం చేయడం గొప్ప విషయం అంటున్నారు. హరీష్ శంకర్ సోషల్ ఇష్యూస్ పై కూడా స్పందిస్తూ ఉంటారు. ట్రాఫిక్, మున్సిపాలిటీ, డ్రైనేజీ ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగా సంబంధిత అధికారులకు తెలియజేస్తాడు... 

బండి కాదు.. మొండి ఇది సాయం పట్టండి pic.twitter.com/pUxdgWsj1t

— devipriya (@sairaaj44)

 

 

click me!