హీరోగా పరిచయమవుతున్న ప్రభాస్‌, అల్లు అర్జున్‌ బాలనటుడు.. ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 15, 2022, 01:09 PM ISTUpdated : Feb 15, 2022, 01:23 PM IST
హీరోగా పరిచయమవుతున్న ప్రభాస్‌, అల్లు అర్జున్‌ బాలనటుడు..  ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్

సారాంశం

హీరో ప్రభాస్‌ (Prabhas), అల్లు అర్జున్‌ (Allu Arjun)ల బాల నటుడు స్వాతిక్ వర్మ ప్రస్తుతం హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. యూత్ ను టార్గెట్ చేస్తూ.. సరికొత్త కథాంశంతో ఫిబ్రవరి 18న ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు.    

హీరో ప్రభాస్‌ (Prabhas), అల్లు అర్జున్‌ (Allu Arjun)ల బాల నటుడు స్వాతిక్ వర్మ నటించిన మూవీ‘బ్యాచ్’. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె (Raghu Kunche) సంగీత సారథ్యంలో యూత్ ఫుల్ బెట్టింగ్ కథాంశాలతో ఈనెల 18 న థియేటర్లలోకి రానుందీ మూవీ.  బాహుబలి (Bahubali), రేసుగుర్రం , దువ్వాడ జగన్నాథం, మళ్ళీరావా వంటి చిత్రాలలో బాలనటుడిగా మెప్పించాడు సాత్విక్ వర్మ. ప్రస్తుతం ఈయన హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బ్యాచ్ ’. బేబీ ఆరాధ్య సమర్పణలో ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకంపై సాత్విక్ వర్మ ,నేహా పటాన్ జంటగా నటిస్తున్నారు. రఘు కుంచే సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 18న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని రెండు పార్టులుగా విడుదల చేస్తున్నారు. 

ఈ  సందర్భంగా చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ.. యూత్ ని టార్గెట్ చేసి తీసిన చిత్రమిది అని తెలిపారు.  బెట్టింగ్, మేల్ ప్రాస్ట్యూషన్ నేపథ్యంతో సాగే సరికొత్త కథాంశంగా పేర్కొన్నారు. రఘు కుంచే అందించిన సంగీతం ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుండగా..  ఇప్పటికే  విడుదలైన పాటలు మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకులను చేరాయన్నారు. ‘బ్యాచ్’ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని తెలిపారు.  

 

చిత్ర నిర్మాత రమేష్ ఘనమజ్జి మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా సినిమా బిజినెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందులో నటించిన సీనియర్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా నటించారని తెలిపారు.  వారంతా మాకు ఫుల్ సపోర్ట్ చేశారని సంతోషం వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18 న వస్తున్న మా 'బ్యాచ్' సినిమా వందశాతం హిట్టవుతుందనే నమ్మకం గట్టిగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.   

కాగా ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా సాత్విక్ వర్మ (Sathvik Varma) , నేహా పటాన్ నటించారు. నటీనటులుగా బాహుబలి ప్రభాకర్, వినోద్ కుమార్, చిన్నా, మిర్చి మాధవి, సంధ్యాజనక్ ,మేకా రామకృష్ణ, డీఎస్ రావు ,చాందిని బతీజ్ , వినోద్ నాయక్ తదితరులు పలు పాత్రల్లో కనిపించనున్నారు. శివ దర్శకత్వం వహిస్తుండగా, నిర్మాతగా  రమేష్ ఘనమజ్జి వ్యవహరిస్తున్నారు. సహ నిర్మాతలుగా సత్తిబాబు కసిరెడ్డి , అప్పారావు పంచాది ఉన్నారు. సంగీతం : రఘు కుంచే, డీవోపీ : వెంకట్ మన్నం, ఎడిటర్ గా  జేపీ, కొరియో గ్రాఫర్ గా రాజ్ పైడి, ఫైట్స్ : నందు, పీఆర్వోగా  హర్ష సహరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Aishwarya Upendra: ఆఫర్లు వస్తున్నా సినిమాలు వద్దంటోంది.. కూతురిపై ఉపేంద్ర కామెంట్స్
Peddi: రాంచరణ్ పెద్ది రిలీజ్ టైంలో న్యూసెన్స్.. నిజంగా అంత ప్రేమ ఉంటే ఇలా చేయండి, నాగవంశీ అదిరిపోయే కౌంటర్