Rajasekhar :రాజశేఖర్ పై ఈ వార్త నిజమైతే పెద్ద దెబ్బే, రూమర్ అయితే స్పందించాలి

By Surya Prakash  |  First Published Feb 15, 2022, 12:42 PM IST

ఆ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడడంతో ఈ యాంగ్రీ హీరో కాస్త డీలా పడ్డాడు. ఆ తర్వాత ‘గరుడ వేగ’తో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు. అనంతరం ‘కల్కి’తో ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్‌ తీసుకున్న ఈ సీనియర్‌ హీరో..   ‘శేఖర్‌’ అనే సినిమాను చేస్తున్నారు.



సినీ పరిశ్రమలో రూమర్స్, వార్తలు కూడా రకరకాల ప్రయోజనాలను ఆశించి ప్రచారంలోకి వస్తాయి. వార్తలో కాస్తంత మసాలా ఉంటే దాన్ని మిగతా మీడియా ఆలోచించకుండా పికప్ చేసి ముందుకు తీసుకెళ్తుంది. అలాంటిదేమన్నా రాజశేఖర్ విషయంలో జరిగిందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ మీడియాలో మారింది. వివరాల్లోకి వెళితే....

  హీరో రాజశేఖర్‌ కు ఇప్పుడంటే ఆయనకు పెద్దగా మార్కెట్‌ లేదు కానీ 20 ఏళ్ల క్రితం ఆయన వరుస  సక్సెస్ లతో చాలా రికార్డులు క్రియేట్ చేసాడు. ఒకప్పుడు తెలుగులో భారీ రెమ్యునేషన్ అందుకున్న హీరోల్లో రాజశేఖర్ కూడా ఉన్నాడు. తొంబైల్లో ఈయన సినిమాలు వస్తే బాక్సాఫీస్ దద్దరిల్లి పోయేది. చిరంజీవి లాంటి హీరోలతో కూడా రాజశేఖర్ పోటీ పడిన సందర్భాలున్నాయి.

Latest Videos

అయితే ఆ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడడంతో ఈ యాంగ్రీ హీరో కాస్త డీలా పడ్డాడు. ఆ తర్వాత ‘గరుడ వేగ’తో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు. అనంతరం ‘కల్కి’తో ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్‌ తీసుకున్న ఈ సీనియర్‌ హీరో..   ‘శేఖర్‌’ అనే సినిమాను చేస్తున్నారు.

 అలాగే గోపీచంద్,శ్రీవాస్ సినిమాలో ఓ ప్రధాన పాత్రకు అడిగాడని వార్తలు వచ్చాయి.  అయితే జీవిత ఇన్వాల్వమెంట్ ఎక్కువైందని వద్దన్నారని వార్తలు వచ్చాయి. స్క్రిప్టు మొత్తం మార్చేసి మల్టిస్టారర్ చేసేస్తోందని ఆమెపై నెపం నెట్టారు. ఇప్పుడేమో మరో వార్త మొదలైంది. ఈ సినిమా కోసం రాజ శేఖర్‌ భారీ పారితోషికం డిమాండ్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడే పేచి వచ్చి తప్పుకున్నట్లు చెప్తున్నారు.

 ఈ మూవీలో హీరో సోదరుడి పాత్ర చాలా కీలకం. రాజశేఖర్ అయితేనే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావించారు. రాజశేఖర్‌ కూడా పాత్ర నచ్చడంతో ఓకే చెబుతూ కొన్ని కండీషన్స్‌ పెట్టాడట. ఈ మూవీకి రూ. 4 కోట్లు పారితోషికంగా ఇవ్వాలని, అంతేకాకుండా తన పాత్రకు తగినంత ప్రాధాన్యత ఉండేలా చూడాలని షరతులు విధించాడట. దీనికి నిర్మాతలు కూడా నో చెప్పి జగపతిబాబుని తీసుకున్నారట. మొదట 3 కోట్లు వరకూ ఇవ్వడానికి రెడీ అయ్యారట.

 కానీ కమర్షియల్ లెక్కలు వేసుకుని, అంతకు మించి పెట్టడం అనవసరం అని జగపతిబాబుతో ముందుకు వెళ్ళాడని అంటున్నారు. లాస్ట్ మినిట్ వ‌ర‌కూ రాజ‌శేఖ‌ర్ నే ఎంచుకోవాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ కుద‌ర్లేదని చెప్తున్నారు. అయితే ఇందులో నిజం ఉందా...లేదా ..మీడియా వాళ్లు క్రియేట్ చేసిన రూమరా అన్నది తెలియాల్సి ఉంది. నిజమే అయితే మాత్రం రాజశేఖర్ ఖచ్చితంగా ఆలోచనలో పడాలి. కాకపోతే మాత్రం స్పందించాలి. లేకపోతే రాజశేఖర్ పై నెగిటివ్ వార్తలు సినీ జనాల్లోకి వెళ్తాయి.

click me!