మహేష్ - సుకుమార్.. మళ్ళీ అదే స్టైల్?

Published : Dec 20, 2018, 05:40 PM IST
మహేష్ - సుకుమార్.. మళ్ళీ అదే స్టైల్?

సారాంశం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ లో కొంచెం గ్యాప్ దొరికితే మహేష్ కొత్త కథలను వింటున్నాడు. రీసెంట్ గా ఒక బాలీవుడ్ కథ వస్తే చేయనని చెప్పాడట.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ లో కొంచెం గ్యాప్ దొరికితే మహేష్ కొత్త కథలను వింటున్నాడు. రీసెంట్ గా ఒక బాలీవుడ్ కథ వస్తే చేయనని చెప్పాడట. ఇక ఓ తమిళ దర్శకుడు వచ్చినా కాన్సెప్ట్ తనకు సరిపోదని సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది. 

మహేష్ ముందు నుంచి సుకుమార్ తో  నెక్స్ట్ సినిమా చేయాలనుకుంటున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే ఆ ప్రాజెక్టు కి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ఇటీవల ఎండ్ అయినట్లు తెలుస్తోంది. మహేష్ కూడా సుకుమార్ కథను వివరించిన విధానానికి ఫిదా అయిపోయాడట. ఇక కథ విషయానికి వస్తే ఈ సినిమా కూడా 1 నేనొక్కడినే తరహాలో ఒక త్రిల్లర్ జానర్ లో తెరకెక్క అవకాశం ఉన్నట్లు సమాచారం. 

కానీ మొదటి సినిమాలో చేసిన మిస్టేక్స్ సుకుమార్ ఈ సబ్జెక్టులో చేయకూదదని ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నాడట. అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థమయ్యేలా తనదైన స్టైల్ లో కథను త్రిల్లర్ జానర్ లో ప్రజెంట్ చేసేందుకు సుకుమార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌