సల్మాన్ తో శిల్పాశెట్టి డేటింగ్.. ఇదిగో క్లారిటీ!

Published : Dec 20, 2018, 04:55 PM IST
సల్మాన్ తో శిల్పాశెట్టి డేటింగ్.. ఇదిగో క్లారిటీ!

సారాంశం

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి ఇప్పటికీ ఫిట్ నెస్ విషయంలో నేటి హీరోయిన్లతో పోటీ పడుతోంది. బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిన ఈ బ్యూటీపై డేటింగ్ వార్తలు ఏంటి అనుకుంటున్నారా..? ఇలాంటి వార్తలైతే వినిపించేవి కానీ ఇప్పట్లో కాదు.

1990లలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ శిల్పాశెట్టితో ప్రేమాయణం  సాగిస్తున్నాడని, ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని పుకార్లు వినిపించేవి. దానికి కారణం సల్మాన్ తరచూ శిల్పాశెట్టి ఇంటికి వెళ్లేవారు. అర్ధరాత్రి పూట కూడా శిల్పాశెట్టి ఇంటి పరిసరాల్లో కనిపించేవారు.

దీంతో మీడియా ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని కంక్లూజన్ కి వచ్చేసింది. ఇప్పటికీ ఈ విషయంపై క్లారిటీ లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిల్పాశెట్టి ఈ రూమర్లపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ''సల్మాన్ కి, నా తండ్రికి మధ్య మంచి అనుబంధం ఉండేది.

ఇద్దరూ కలిసి కూర్చొని తాగేంతగా కలిసి ఉండేవారు. అందుకే సల్మాన్ తరచూ మా ఇంటికి వచ్చేవాడు. నా తండ్రి చనిపోయిన తరువాత.. సల్మాన్ ఎప్పుడు మా ఇంటికి వచ్చినా.. నేరుగా బార్ రూమ్ దగ్గరకి వెళ్లి టేబుల్ పై తలపెట్టుకొని ఏడ్చేవారు. అంతేతప్ప మా మధ్య ఎలాంటి సంబంధం లేదు'' అంటూ చెప్పుకొచ్చింది. 
 
PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌