Anasuya: అనసూయ పాత్ర లీక్.. ఆమె చనిపోతుందా, మరో ట్విస్ట్ ఏంటంటే ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 30, 2022, 02:57 PM IST
Anasuya: అనసూయ పాత్ర లీక్.. ఆమె చనిపోతుందా, మరో ట్విస్ట్ ఏంటంటే ?

సారాంశం

అనసూయ బుల్లితెరపై ఎంతటి స్టార్ యాంకరో వెండితెరపై కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అనసూయ బుల్లితెరపై ఎంతటి స్టార్ యాంకరో వెండితెరపై కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. 

విభిన్నమైన పాత్రలకు ప్రస్తుతం అనసూయ దర్శకులకు బెస్ట్ ఛాయిస్ గా మారుతోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా నటించిన అనసూయ.. పుష్పలో మరింత ఘాటు పెంచుతూ నెగిటివ్ షేడ్స్ లో నటించింది ఈ బ్యూటీ. ఇది పక్కన పెడితే అనసూయ రవితేజ ఖిలాడీ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రంలో ఆమె రోల్ గురించి అదిరిపోయే న్యూస్ లీక్ అయింది. అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ చిత్రంలో అనసూయ డ్యూయెల్ రోల్ లో నటిస్తోంది అట. అనసూయ కోసం రమేష్ వర్మ బలమైన పాత్రనే రచించినట్లు తెలుస్తోంది. రెండు పాత్రల్లో ఒక పాత్రలో అనసూయ బ్రాహ్మణ యువతిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరో రోల్ గురించి తెలియదు కానీ.. ఒక పాత్రలో అనసూయ చనిపోతుందట. ఈ న్యూస్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. ఫిబ్రవరి 11న ఖిలాడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అనసూయకు బలమైన పాత్ర పడితే ఆ మూవీ పక్కా హిట్ అంటూ అభిమానులు భావిస్తున్నారు.  రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా