
సౌత్ సినిమాలపై బాలీవుడ్ మోజు అంతకంతకు పెరిగిపోతోంది. ఇప్పటికే దాదాపు పాతికకు పైగా సౌత్ కథలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడు బన్నీ (Allu Arjun) మరో సినిమా బాలీవుడ్ చేరింది. అయితే ఈ సినిమా ద్వారా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar )బాలీవుడ్ గుమ్మం తొక్కబోతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కెరియర్లో బెస్ట్ మూవీస్ లో దువ్వాడ జగన్నాథం(Duvvada Jagannathm) కూడా ఒకటి. 2017లో వచ్చిన ఈ సినిమా అంత పెద్ద కమర్షియల్ హిట్ కాకపోయినా..బన్ని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ను బాగానే అలరించింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో ..దిల్ రాజు(Dil Raju) నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. అల్లు అర్జున్ జోడీగా పూజ హెగ్డే(Pooja Hegde) నటించింది.
ఇక ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్టు న్యూస్ గతంనుంచీ బలంగా వినిపిస్తోంది.తెలుగులో ఈ సినిమాకి దర్శక నిర్మాతలుగా వ్యవహరించిన హరీశ్ శంకర్(Harish Shankar) దిల్ రాజు(Dil Raju)ల కాంబినేషన్ లోనే దువ్వాడ జగన్నాథం హిందీ రీమేక్ ను కూడా చేయనున్నారట. ఈ సినిమాతోనే హరీశ్ శంకర్ బాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి రంగంలోకి దిగుతున్నారట.
అయితే దువ్వాడ జగన్నాథం (Duvvada Jagannathm) హిందీ రీమేక్ లో మొదటి నుంచి ముగ్గురు యంగ్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. సిద్ధార్ధ్ మల్హోత్రాతో పాటు టైగర్ ష్రాఫ్,వరుణ్ దావణ్ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు దువ్వాడ జగన్నాథం సినిమాలో సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. హిందీలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోను తీసుకుంటే.. హీరోయిన్ గా తప్పకుండా పూజానే తీసుకునే అవకాశం కనిపిస్తుంది.