కాజోల్‌ ముఖాన్ని చూపించలేకపోతుందట.. కారణమిదే

Published : Jan 30, 2022, 12:38 PM ISTUpdated : Jan 30, 2022, 12:44 PM IST
కాజోల్‌ ముఖాన్ని చూపించలేకపోతుందట.. కారణమిదే

సారాంశం

కాజోల్‌కి కరోనా సోకింది. తనకి కోవిడ్‌ 19 పాజిటివ్‌గా  వచ్చిందని తెలిపింది. ఈమేరకు ఆమె ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్‌ అవుతుంది. 

బాలీవుడ్‌ హీరోయిన్‌, అజయ్‌దేవగన్‌ భార్య కాజోల్‌(Kajol) సైతం కరోనా బారిన పడ్డారు. ఆమె తనకు కోవిడ్‌ 19(Kajol Covid 19 Positive) పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని ఆదివారం(జనవరి 30)న వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది కాజోల్‌. అయితే ఈ సందర్భంగా ఆమె తన కూతురు ఫోటోని షేర్‌ చేయడం విశేషం. కోవిడ్‌ కారణంగా ముక్కు ఎరుపెక్కిందని, ముక్కు కారుతున్న నేపథ్యంలో అలా తన ఫేస్‌ని చూపించలేనని చెప్పినకాజోల్‌ తన కూతురు నైసా పిక్‌ని షేర్‌ చేసుకుంది. 

`నాకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నేను నిజంగా నా రన్నీ నోస్‌ని చూపించాలనుకోవడం లేదు. అందుకే మనం ప్రపంచంలోని అద్బుతమైన చిరునవ్వుని కలిగి ఉందాం. నైసా దేవగన్‌ నిన్ను చాలా మిస్‌ అవుతున్నా. కానీ నిన్ను చూడగలను` అని పేర్కొంది కాజోల్‌. కాజోల్‌ పంచుకున్న ఫోటోలో నైసా ట్రెడిషనల్‌ లుక్‌లో, మెహందీ పెట్టుకుని ఏదో వేడుకలో పాల్గొన్నట్టుగా ఉంది. ఆమె ముఖంపై చిరునవ్వు ఉంది. ఆ పిక్‌ కట్టిపడేస్తుంది. నైసా.. Kajol, అజయ్‌ దేవగన్‌ల ముద్దుల తనయ అనే విషయం తెలిసిందే. 

ఇక కాజోల్‌ పోస్ట్ కి చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు. త్వరగా మహమ్మారి నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నారు. వారిలో ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. ఆమె స్టన్నింగ్‌ అంటూ పోస్ట్ చేసింది ప్రియాంక. ఆమెతోపాటు చాలా మంది సెలబ్రిటీలుస్పందించారు. ఇక కాజోల్‌ చివరగా `త్రిభంగా` అనే నెట్‌ఫ్లిక్స్ లో నటించింది. ఆమెకిది ఓటీటీ ఎంట్రీ కావడం విశేషం. రేణుకా సాహనే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కాజోల్‌ రేవతి దర్శకత్వం వహిస్తున్న `ది లాస్ట్ హర్రే` చిత్రంలో నటిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

సమంత , రాజ్ రొమాంటిక్ స్పోర్ట్స్ డేట్? పికిల్‌బాల్ ఆడుతూ కనిపించిన కొత్త జంట
98 కిలోల స్టార్ హీరో..తక్కువ టైమ్ లో 18 కిలోల బరువు ఎలా తగ్గాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఆమిర్ ఖాన్