కిరణ్ అబ్బవరం కోసం రవితేజ.. ట్రైలర్ విడుదల చేసిన నాని.. సప్త సాగరాలు ట్రైలర్.. టుడే మూవీ అప్డేట్స్

Published : Sep 19, 2023, 09:39 PM ISTUpdated : Sep 19, 2023, 09:41 PM IST
కిరణ్ అబ్బవరం కోసం రవితేజ.. ట్రైలర్ విడుదల చేసిన నాని.. సప్త సాగరాలు ట్రైలర్.. టుడే మూవీ అప్డేట్స్

సారాంశం

రూల్స్ రంజన్, సప్త సాగరాలు ధాటి, రాక్షస కావ్యం, వేణు తొట్టెంపూడి కొత్త సిరీస్ నుంచి ఈరోజు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్  అందాయి. రవితేజ, నాని, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.   

Rules Ranjaan Fouth Song
సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం Rules Ranjann. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్నారు. రత్నం కృష్ణ దర్శకత్వం. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ‘సమ్మోహనుడా’, మరో రెండు పాటలు దుమ్ములేపాయి. ఇక తాజాగా మాస్ మహారాజా రవితేజ (RaviTeja)  చేతుల మీదుగా నాలుగో పాట 'దేఖో ముంబై'ని ఈరోజు విడుదల చేశారు. పాట బాగుందని చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. అక్టోబర్ 6న చిత్రం విడుదల కానుంది. టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 


Sapta Sagaralu Dhati Trailer
కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ‘777చార్లీ’ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. హేమంత్ ఎం రావు దర్శకత్వం. రుక్మిణీ వసంత్ హీరోయిన్. సెప్టెంబర్ 1న కన్నడలో విడుదలై సక్సెస్ అయ్యింది. సెప్టెంబర్ 22న తెలుగులో విడుల కాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈరోజు మూవీ ట్రైలర్ ను నేచురల్ స్టార్ నాని (Nani) విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, రచయిత బి.వి.ఎస్.రవి పాల్గొని మాట్లాడారు. 

Venu Thottempudis Athidi Web Series
సీనియర్ నటుడు, హీరో వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా లీడ్ రోల్ లో నటించిన వెబ్ సిరీస్ ‘అతిథి’ (Athidi). రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్ గా వ్యవహరించారు. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా వెబ్ సిరీస్ లో నటించిన ఎక్సీపిరియన్స్  ను హీరో వేణు తెలియజేశారు. ఇందులో కామెడీ, సస్పెన్స్, డ్రామా, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయన్నారు. లాక్ డౌన్ లో వెబ్ సిరీస్ లు  చాలా చూశాను. అప్పుడే ఒక వెబ్ సిరీస్ చేయాలనిపించింది. అనుకున్నట్లే ఈ వెబ్ సిరీస్ లో చేశాను. అందులోనూ నా కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ హారర్ కంటెంట్ లో నటించాను. సెకండ్ ఇన్నింగ్స్ లో స్పీడ్ గా సినిమాలు చేయాలని లేదు. మంచి సబ్జెక్ట్ చేయాలని మాత్రమే ఉంది.  

Rakshasa Kavyam Trailer
‘రాక్షస కావ్యం’ ట్రైలర్ విడుదలైంది. చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju)  పాల్గొన్నారు. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమానే ‘రాక్షస కావ్యం’. గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీమాన్ కీర్తి దర్శకుడు. అక్టోబర్ 6న రాబోతోంది. తాజాగా ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. అనంతరం సినిమా గురించి మాట్లాడారు. యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కొత్తవాళ్లతో నిర్మాత దాము మంచి ప్రయత్నం చేశారని ప్రశంసించారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sing Geetham Collection: సింగ్‌ గీతం మూవీ 3 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంత దారుణమా?
Tarun to Chiru: ఈ కథలతో ఇండస్ట్రీ దద్దరిల్లే హిట్లు కొట్టారా, అస్సలు నమ్మలేరు.. తరుణ్ నుంచి చిరంజీవి వరకు