పవన్ కళ్యాణ్ మనసు బంగారం, ఏపీ సీఎంగా చూడాలని ఉంది.. వైరల్ వీడియోపై హీరోయిన్ క్రేజీ కామెంట్స్ 

Published : Sep 19, 2023, 09:05 PM IST
పవన్ కళ్యాణ్ మనసు బంగారం, ఏపీ సీఎంగా చూడాలని ఉంది.. వైరల్ వీడియోపై హీరోయిన్ క్రేజీ కామెంట్స్ 

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బంగారం' చిత్రంలో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా వరుసగా వార్తల్లో నిలుస్తోంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బంగారం' చిత్రంలో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా వరుసగా వార్తల్లో నిలుస్తోంది. మీరా చోప్రా తరచుగా సోషల్ మీడియాలో ఇండియాలో హైలైట్ అవుతున్న పొలిటికల్ టాపిక్స్ పై తన అభిప్రాయాలు షేర్ చేస్తూ ఉంటుంది. 

ఇటీవల ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మీరా చోప్రా మండిపడ్డ సంగతి తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ పై తీవ్రంగా విమర్శలు చేసింది. సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని ప్రశంసిస్తూ పోస్ట్ కూడా చేసింది. 

ఇప్పుడు మీరా చోప్రా మరోసారి పవన్ కళ్యాణ్ పై క్రేజీ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్ ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని ఉందంటూ తన కోరిక బయట పెట్టింది. పవన్ ని ఎందుకు మీరా చోప్రా సీఎం గా చూడాలని అనుకుంటోందో ఆమె చేసిన పోస్ట్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 

పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మహిళలకు రిజర్వేషన్ అనే అంశాన్ని 2019 ఎన్నికలప్పుడు ప్రస్తావించడం మాత్రమే కాదు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఓ నెటిజన్ పవన్ కళ్యాణ్ మహిళల రిజర్వేషన్ గురించి ప్రసంగిస్తున్న వీడియో షేర్ చేశాడు.

ఈ వీడియో కి మీరా చోప్రా రిప్లై ఇస్తూ.. ఆయన మనసు నిజంగా బంగారం. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది అంటూ మీరా చోప్రా పోస్ట్ చేసింది. మీరా చోప్రా పోస్ట్ పై జనసేన కార్యకర్తలు , పవన్ కళ్యాణ్  అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీ కోరిక నెరవేరుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌