‘సూర్య41’ మూవీ షూటింగ్ ఏ దశలో ఉంది? ఇంట్రెస్టింగ్ అప్డేట్..

Published : May 04, 2022, 03:29 PM IST
‘సూర్య41’ మూవీ షూటింగ్ ఏ దశలో ఉంది? ఇంట్రెస్టింగ్ అప్డేట్..

సారాంశం

తమిళ స్టార్ హీరో, డైరెక్టర్ బాలా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సూర్య41’. ఈ కాంబినేషన్ లో దాదాపు 20 ఏండ్ల తర్వాత వుస్తున్న చిత్రం కావడంతో తారా స్థాయి అంచనాలు ఉన్నాయి. కాగా చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ మేరకు తాజాగా అప్డేట్ అందింది.  

సినిమా విషయంలో కొత్తగా ఆలోచించే హీరోలలో హీరో సూర్య(Surya) ముందు వరసలో ఉంటాడు. అందుకే ఆయన సినిములు సక్సెస్ అయినా కాకపోయినా.. బాగుంటాయి.  ఈమధ్య వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న సూర్య బాలాతో మరో ప్రయోగాత్మక సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. 2‌003లో సూర్య, విక్రమ్ కలిసి నటించిన చిత్రం ‘శివ పుత్రుడు’కు బాలా దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ కుదరలేదు. ఎట్టకేళ్లకు వీరిద్దరూ ‘సూర్య41’తో మరోసారి మ్యాజిక్ చేయనున్నారు.  

సూర్య హీరోగా బాలా డైరెక్షన్ లో.. కృతి శెట్టి (Kriti Shetty) హీరోయిన్ గా నటిస్తోంది. జీవి ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్షన్ లో సినిమా ను చేయబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ గతంలోనే ఇచ్చేసింది  టీమ్. అయితే గత నెలలో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం..  కన్యాకుమారిలో 34 రోజుల 1వ షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసింది టీం.  దీంతో తన నెక్ట్స్ షెడ్యూల్ కు సిద్ధమవుతున్నారు. అయితే తర్వాత షెడ్యూల్ లో భారీ సెట్ వర్క్ ఉండనుంది. దీంతో వచ్చే నెల జూన్ లో రెండో షెడ్యూల్ పూర్తి స్టార్ట్ కానుంది.  ఈ షెడ్యూల్ 15 రోజుల పాటు సాగనుంది. ఆ తర్వాత షెడ్యూల్ గోవాలో ప్రారంభం కానుంది. ఈ మేరకు 2డీ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది. 

ఇటీవల సూర్య ‘ఈటీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ అంతకు ముందు వచ్చిన చిత్రాలు ‘జై భీం, ఆకాశమే నీ హద్దురా’ చిత్రాలతో ప్రేక్షకులను  మెప్పించాడు. అయితే 18 ఏండ్ల తర్వాత డైరెక్టర్ బాలా దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘సూర్య 41’పై ప్రస్తుతం అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో సూర్య ఇప్పటి వరకూ చేయని  చెవిటి - మూగ పాత్రలో కనిపిస్తాడని టాక్.  గతంలో సూర్య సుందరాంగుడు సినిమాలో పొట్టి గూని పాత్రలో నటించారు. ఇప్పుడు మూగ, చెవిటి పాత్రలో కనిపించబోతున్నారు.  

 

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే